ఈ భూమిపై ఎన్నో రకాల చిన్నచిన్న జీవులు జీవిస్తూ ఉన్నాయి.మరికొన్ని జీవులు మన ఇంట్లో కూడా కనిపిస్తూ ఉంటాయి.
వాటిలో బొద్దింకలు, చీమలు, బల్లులు వంటివి ఎన్నో ఉంటాయి.కొన్ని జీవులు ఇంట్లో కనిపిస్తే మంచి శకునమా కాదా అనే అనుమానాలు చాలామందిలో ఉంటాయి.
అలాంటి వాటిలో ముఖ్యమైనది బల్లి.మరి బల్లి ఇంట్లో కనిపిస్తే మంచిగా కాదా అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఇంట్లో బల్లి( lizard ) కనిపిస్తే జీవితంలో ఏదో కొత్త విషయం రాబోతుందని అర్థం చేసుకోవచ్చు.జీవితం ఒకసారి రిఫ్రెష్ అవుతుందని అవుతుంది అనడానికి ఇది సంకేతం అని పండితులు చెబుతున్నారు.
కొంతమందికి బల్లి కలలో కనిపిస్తుంది.కొంతమందికి ఎక్కడ వెళ్తే అక్కడ బల్లులు లేదా బల్లుల బొమ్మలు లేదా ఏదో ఒక బల్లికి సంబంధించిన చిహ్నాలు కనిపిస్తూ ఉంటాయి.

వాటి ద్వారా మీకు అందాల్సిన సందేశం అందే వరకు బల్లులు మీకు కనిపిస్తూనే ఉంటాయి.ఇంట్లో బల్లులు కనిపించడానికి గల ఆధారాలను ఇప్పుడు తెలుసుకుందాం.ఇంట్లో బల్లి కనిపించిందంటే మీ ఇల్లు సురక్షితమైనది, ఆశ్రయం ఇచ్చేందుకు అనువైంది అని అర్థం చేసుకోవచ్చు.సాధారణంగా బల్లులు మనుషులకు దూరంగా ఉంటాయి.అయినా మీకు కనిపించింది అంటే కచ్చితంగా కారణం లేకుండా అసలు ఉండదు.కొత్త విషయాలు ఏవో మీ జీవితంలోకి రాబోతున్నాయని అలాగే కొత్త వ్యక్తుల రాకతో మీ జీవితం మరింత మెరుగవుతుందని అర్థం చేసుకోవచ్చు.
అది మీకు పునర్జన్మ వంటిది కూడా కావచ్చు.ఇంట్లో బల్లి కనిపించడం రాబోయే అదృష్టానికి సంపదకు సంకేతమని చాలామంది ప్రజలు చెబుతారు.
కష్టాలలో ఉన్నప్పుడు బల్లి కనిపిస్తే మీరు ఆ కష్టాన్ని విజయవంతంగా దూరం చేసుకుంటారని అర్థం చేసుకోవచ్చు.ఇంట్లో బల్లి కనిపిస్తే ఒక్కోసారి రాబోయే ప్రమాదానికి హెచ్చరిక కూడా కావచ్చు.
మీకు తోక తెగిపోయిన బల్లిని మీ ఇంట్లో గమనిస్తే అది మీరు జీవితం కోసం చాలా కష్టపడుతున్నారని అర్థం చేసుకోవచ్చు.మీ చుట్టూ నమ్మకద్రోహులు చేరారని కూడా సంకేతం.
కొత్తగా మీ జీవితంలో వచ్చేవారు మీకు చెడు చేసే అవకాశం ఉందని సంకేతం.