ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయ వేడి కొనసాగుతోంది.ఈ మేరకు జిల్లా నేతలతో సీఎం కేసీఆర్ భేటీకానున్నారు.
ఈ సమావేశం నిన్న జరగాల్సి ఉండగా ఇవాళ్టికి వాయిదా పడిన సంగతి తెలిసిందే.
ఈ సమావేశంలో ప్రధానంగా ఉమ్మడి జిల్లా రాజకీయాలపై కేసీఆర్ చర్చించనున్నారని తెలుస్తోంది.
ఇటీవల మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరడంతో పాటు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అసంతృప్తితో ఉన్న నేపథ్యంలో కేసీఆర్ నిర్వహిస్తున్న భేటీకి ప్రాధాన్యత నెలకొంది.గిరిజన ఎమ్మెల్యేలతో పాటు పార్టీ అభ్యర్థులతో కేసీఆర్ భేటీ అయి జిల్లాలో తుమ్మల ప్రభావం ఎంతవరకు ఉంటుందనే విషయంపై ఆరా తీయనున్నారు.
అనంతరం గిరిజనులకు పోడు భూముల పట్టాలు మరియు రైతుబంధు అమలుపై చర్చించనున్నారు.