నేటి నుంచి శ్రావణమాసం.. శ్రావణ మాస ప్రాముఖ్యత.. చేయాల్సిన పూజలు!

హిందూ క్యాలెండర్ ప్రకారం తెలుగులో 12 నెలలు ఉంటాయి.ఈ పన్నెండు నెలలలో 5వ నెలను శ్రావణ మాసం అంటారు.

 Shravana Masam 2021 Festival Dates Significance Puja Fast History Bhakti Rituals-TeluguStop.com

శ్రావణ మాసం అన్ని మాసాల కన్నా ఎంతో ప్రత్యేకమైనది.శ్రావణ మాసాన్ని రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాలలో కూడా పెద్ద ఎత్తున ఈ మాసంలో ప్రత్యేక పూజలు,వ్రతాలు, నోములలో పాల్గొంటారు.

ఎంతో ముఖ్యమైన శ్రావణమాసం ఆగస్టు 9 ప్రారంభమయ్యే సెప్టెంబర్ 7న ముగుస్తుంది.మరి ఈ నెల ప్రాముఖ్యత ఏమిటి? ఈ నెలలో చేయవలసిన పూజలు ఏమిటి అనే విషయాలను తెలుసుకుందాం.

శ్రావణ మాసం ఎంతో పరమ పవిత్రమైన మాసం అని చెప్పవచ్చు.ఈ నెలలో సోమవారం, మంగళవారం, శుక్రవారం, శనివారాలను ఎంతో పవిత్రమైన రోజుగా భావిస్తారు.ఈ ప్రత్యేకమైన రోజులలో భక్తులు ఉపవాస దీక్షలతో పూజలు చేస్తుంటారు.ఎంతో పవిత్రంగా భావించే శ్రావణమాసంలో చాలామంది మాంసాహారం ముట్టుకోరు.

ముఖ్యంగా శ్రావణ మాసంలో వచ్చే సోమవారాలు ఎంతో పవిత్రమైనవి.ఈ సోమవారం పరమశివుడికి ప్రత్యేకమైన పూజలు చేయడం వల్ల స్వామివారి అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉంటుంది.

శ్రావణ మాసంలో శివునికి ఎందుకు అంత ప్రత్యేకమనే విషయానికి వస్తే.లక్ష్మీదేవి విష్ణుమూర్తి పై అలిగి సముద్ర గర్భంలో దాగి ఉంటుంది.ఈ క్రమంలోనే దేవతలు రాక్షసులు సాగర మధనం చేసినప్పుడు సముద్రగర్భం నుంచి లక్ష్మీదేవి తిరిగి ఉద్భవిస్తుంది.అయితే లక్ష్మీదేవి ఉద్భవించడానికంటే ముందుగా సముద్రం నుంచి కాలకూట విషం బయటపడుతుంది.

అయితే ఈ విష ప్రభావం దేవతలు రాక్షసులు పై ఉంటుందని గ్రహించిన పరమశివుడు ఆ విషాన్ని సేవించి తన కంఠంలో ఉంచుకుంటాడు.ఈ క్రమంలోనే శ్రావణమాసంలో పెద్ద ఎత్తున పరమ శివుడికి పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది.

Telugu Dates, Fast, Puja Vidhi, Shravan, Significance-Latest News - Telugu

అదేవిధంగా లక్ష్మీదేవికి ఈ మాసంలో ప్రత్యేక పూజలు చేస్తారు.పార్వతీదేవికి పసుపు కుంకుమలతో నోము నోయటం వల్ల తమ పసుపు కుంకుమలు పది కాలాలపాటు చల్లగా ఉంటాయని వివాహితులు ఈ మాసంలో మంగళగౌరీ వ్రతం ఆచరిస్తారు.ఈ విధంగా శ్రావణ మాసం మొత్తం భక్తులు ఉపవాస దీక్షలతో ప్రత్యేక పూజలలో నిమగ్నమై ఉంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube