సర్కారు వారి పాట టీజర్ చూశారా.. విశ్వరూపం చూపించిన మహేష్!

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మహేష్ అభిమానులకు సర్కారీ వారి పాట చిత్రబృందం సడన్ సర్ప్రైస్ ఇచ్చి అభిమానులకు షాక్ ఇచ్చింది.మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా సర్కారీ వారి పాట చిత్రం నుంచి అదిరిపోయే గిఫ్ట్ ఇవ్వాలని భావించారు చిత్రబృందం.

 Mahesh Babu Brithday Special Sarkaru Vaari Paata Blaster Released, Sarkaru Vari-TeluguStop.com

ఈ క్రమంలోనే నేడు ఉదయం 9 గంటల తొమ్మిది నిమిషాలకు సర్కారీ వారి పాట టీజర్ విడుదల చేయాలని చిత్రబృందం భావించారు.ఈ క్రమంలోనే 9:00 ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఎంతగానో ఎదురు చూశారు.అయితే అనుకున్న దానికన్నా ముందుగానే టీజర్ విడుదల చేసి అభిమానులకు నిద్ర లేకుండా చేస్తున్నారని చెప్పవచ్చు.

అర్ధరాత్రి 12 గంటల సమయంలో మహేష్ “సర్కారీ వారి పాట” టీజర్ విడుదల చేశారు.

ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈ టీజర్ లో భాగంగా.”ఇందు మూలంగా యావన్ మంది ప్రజానీకానికి తెలియజేయునది ఏమనగా”.అంటూ మహేష్ బాబు ఎంట్రీ ఇస్తారు.

ఇలా మహేష్ ఎంట్రీ ఇవ్వడంతోనే ” ఇఫ్ టైగర్ టేక్స్ రాబిట్“అంటూ చెప్పిన డైలాగ్ అభిమానులకు కేక పుట్టిస్తుందని చెప్పవచ్చు.ఈ క్రమంలోనే విలన్ గ్యాంగ్ కు మహేష్ ” ఇఫ్ యు మిస్ ద ఇంట్రెస్ట్.

యు విల్ గెట్ యువర్ డేట్“అని వార్నింగ్ ఇస్తూ తనలో ఉన్న యాక్షన్ కోణాన్ని ఎంతో అద్భుతంగా చూపించారు.

ఈ క్రమంలోనే కీర్తి సురేష్ ఎంటర్ అవుతూ.”పడుకునే ముందు ప్రతిరోజు దిష్టి తీయడం మర్చిపోకండి అంటూ మహేష్ గ్లామర్ గురించి కీర్తి సురేష్ పొగుడుతారు.అదేవిధంగా కీర్తి సురేష్ జడలో ఉన్న పువ్వులను చూపిస్తూ ఏమయ్యా కిషోర్ ఒక ఐదారు మూరలు ఉండవవి అంటూ పంచు డైలాగ్ చేశారు.

ఈ విధంగా టీజర్ ను వదలండంతో ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ క్రమంలోనే మహేష్ అభిమానులు పెద్ద ఎత్తున తమ అభిమాన నటుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మహేష్ టీజర్ ను వైరల్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube