ఈ మధ్యకాలంలో ఎక్కువగా మాస్ సినిమాలను రీ రిలీజ్ చేయడం చూస్తూనే ఉన్నాం.అయితే చెన్నకేశవరెడ్డి, పోకిరి, జల్సా వంటి భారీ మాస్ యాక్షన్ సినిమాలు విడుదల చేసిన కూడా అద్భుతమైన వసూల్లను సాధించాయి.
వీటితో పాటు కల్ట్ లవ్ స్టోరీ కూడా విడుదల చేస్తే ఎలా ఉంటుంది అని అందరూ ఎదురు చూశారు.

ఈ క్రమంలోనే ఆరెంజ్, ఖుషి, ఓయ్ వంట సినిమాలు వచ్చి అభిమానుల మనసులను మరోసారి ఆకర్షించాయి.ఇవి మాత్రమే కాదు డబ్బింగ్ సినిమాలైనా ధనుష్, సూర్య సన్నాఫ్ కృష్ణన్ కూడా మంచి వసూళ్లనే రాబట్టాయి.దాంతో ప్రేమ కథ సినిమాలకు మళ్ళీ జోరు పెరిగింది.
ఎన్ని మాస్ సినిమాలు ఉన్న ఒక ప్రేమ కథ కి ఉండే ఆ అట్రాక్షన్ వేరు.అందుకే ఇక రంగంలోకి మరో రెండు భారీ కల్ట్ ప్రేమకథలు రాబోతున్నాయి.

ఆ మ్యాజిక్ ని రిపీట్ చేయడానికి ఇప్పుడు రాబోతున్న సినిమాల విషయానికొస్తే మొదటగా 20 ఏళ్ల క్రితం తేజ( Teja ) దర్శకత్వంలో ఉదయ్ కిరణ్ , అనిత హీరో హీరోయిన్స్ గా తెరకెక్కిన నువ్వు నేను చిత్రం ( Nuvvu Nenu movie )గురించి చెప్పాలి.ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది.మ్యూజిక్ కూడా అద్భుతంగా ఉన్న ఈ సినిమా వల్ల ఉదయ్ కిరణ్ కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది.ఇక ప్రభుదేవా కెరియర్ లోనే బిగ్గెస్ట్ కల్ట్ మూవీ అయినటువంటి ప్రేమికుడు( Premikudu ) కూడా మళ్లీ విడుదలకు సిద్ధమవుతోంది.
ఈ సినిమా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కగా అప్పట్లో తమిళ్ కన్నా కూడా తెలుగులోనే భారీ వసూలను సాధించింది.

ఈ వరుసలోనే సిద్ధార్థ నటించిన బొమ్మరిల్లు( bommarillu ) చిత్రాన్ని, తరుణ్ మొట్టమొదటి బ్లాక్ బ్లాస్టర్ హిట్ అయిన నువ్వే కావాలి సినిమా ( nuvvekavali movie )కూడా రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సన్నాహాకాలు చేసుకుంటున్నారు.ఇక మార్చి 21న నువ్వు నేను సినిమా విడుదల అవుతుండగా సిద్ధార్థ పుట్టిన రోజు నాడు బొమ్మరిల్లు సినిమా కూడా విడుదలవుతోంది.ఇలా ఒకప్పుడు ప్రేమ కథలతో యూత్ ని కట్టిపడేసిన ఈ సినిమాలన్నీ విడుదల అవుతుంటే మరో మారు మంచి వసూలను కూడా రాబడుతున్నాయి.







