టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నటించిన శాకుంతలం సినిమా ఫిబ్రవరి 17వ తారీఖున విడుదల అవ్వాల్సి ఉండగా వాయిదా వేస్తున్నట్లు చిత్ర యూనిట్ సభ్యుల అధికారికంగా ప్రకటించారు.ఏప్రిల్ నెలలో సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విధంగా ప్లాన్ చేసినట్లు సమాచారం అందుతుంది.
సమంత ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డట్లు చిత్ర యూనిట్ సభ్యులు పదే పదే చెప్తున్నారు.ఇక దర్శక నిర్మాత గుణ శేఖర్ ఇప్పటికే ట్రైలర్ విడుదల చేశాడు.
సాధారణంగా సినిమా విడుదలకు వారం లేదా రెండు వారాల ముందు థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేయడం జరుగుతుంది.
ఈ సినిమా కు నెల రోజుల ముందుగానే థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేయడం జరిగింది.
ఇప్పుడు తీరా సినిమా విడుదల వాయిదా పడింది.దాంతో ఏప్రిల్లో సినిమా విడుదలయ్యే సమయంలో ప్రమోషన్ కోసం ట్రైలర్ లేకపోతే ఎలా అంటూ సమంత అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
సినిమా విడుదల తేదీ విషయం లో క్లారిటీ లేకుండా ట్రైలర్ ఎలా రిలీజ్ చేశారు అంటూ సమంత అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాల వారు మరియు సినిమాను కొనుగోలు చేసిన బయ్యర్స్ ఆగ్రహం తో ఉన్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే ట్రైలర్ విడుదల చేశారు కనుక సినిమా విడుదల సమయం లో మళ్లీ ఒక ట్రైలర్ ని విడుదల చేయాల్సి ఉంటుంది.అలా చేయడం వల్ల సినిమా కు నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.దర్శకుడు గుణశేఖర్ యొక్క అనాలోచిత నిర్ణయం తో శాకుంతలం సినిమా యొక్క భవిష్యత్తు ఆందోళనకరంగా మారిందని సమంత అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సమంత మయో సైటిస్ అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నా కూడా ప్రమోషన్ కోసం హాజరు అయ్యేందుకు ఓకే చెప్పింది.కానీ దర్శక నిర్మాత గుణశేఖర్ సద్వినియోగం చేసుకోలేక పోయాడు.