జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) హీరోగా తెరకెక్కి ఆశించిన ఫలితాన్ని అందుకోని సినిమాలలో తీన్ మార్( Teen Maar Movie ) ఒకటి.లవ్ ఆజ్ కల్ సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది.2011 సంవత్సరం ఏప్రిల్ నెల 14వ తేదీన ఈ సినిమా విడుదలైంది.అయితే ఈ సినిమా నిర్మాత బండ్ల గణేష్ కు( Producer Bandla Ganesh ) భారీ నష్టాలను తెచ్చిపెట్టిన సినిమాలలో ఒకటి కావడం గమనార్హం.
అయితే వాలంటైన్స్ డే( Valentines Day ) సందర్భంగా ఈ సినిమాను రీరిలీజ్ చేయాలని పవన్ ఫ్యాన్స్ కోరిన నేపథ్యంలో నిర్మాత బండ్ల గణేష్ స్పందించారు.ఒక నెటిజన్ తీన్ మార్ సినిమాలో లైవ్ డబ్బింగ్ ఎందుకు చెప్పారని థియేటర్ లో అసలు డైలాగ్స్ వినిపించలేదని కామెంట్ చేశారు.
ఈ కామెంట్ గురించి బండ్ల గణేష్ స్పందిస్తూ కొత్తగా డబ్బింగ్ చెప్పి మళ్లీ మిక్సింగ్ చేసి ఆ తర్వాత సినిమాను రిలీజ్ చేస్తామని చెప్పారు.

పవన్ కళ్యాణ్ తీన్ మార్ మూవీ రీరిలీజ్( Teen Maar Re-release ) అయితే కలెక్షన్ల విషయంలో కొత్త రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.పవన్ కళ్యాణ్ ఈ ఏడాది హరిహర వీరమల్లు, ఓజీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.హరిహర వీరమల్లు చెప్పిన తేదీకి రిలీజవుతుందో లేదో చూడాల్సి ఉంది.
ఓజీ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి మాత్రం అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ ప్లాన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి.పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో ఎన్నో సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ బెస్ట్ ప్రాజెక్ట్ లను ఎంచుకుని సరికొత్త రికార్డులను క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
తీన్ మార్ రీరిలీజ్ డేట్ కు సంబంధించి ఎప్పుడు క్లారిటీ వస్తుందో చూడాలి.







