విరేచనాలు తగ్గటానికి అద్భుతమైన ఇంటి చిట్కాలు

వేసవికాలం వచ్చిందంటే రకరకాల సమస్యలు వస్తు ఉంటాయి.వాటిలో డయేరియా ఒకటి.

 Loose Motions, Bacterial Infections, Diarrhea Problem,health Tips-TeluguStop.com

తరచుగా నీళ్ళ విరేచనాలు అవ్వటం,కడుపునొప్పి,డి హైడ్రేషన్ వంటి లక్షణాలు ఉంటాయి.ఈ లక్షణాల కారణంగా విపరీతమైన నీరసం వచ్చేస్తుంది.

కొన్ని చిట్కాలను పాటిస్తే విరేచనాల సమస్య నుండి చాలా తేలికగా బయట పడవచ్చు.ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

ఒక గ్లాస్ మజ్జిగలో అరస్పూన్ పసుపు వేసి త్రాగాలి.పసుపులో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు విరేచనాలకు కారణం అయినా బ్యాక్టీరియాను తరిమికొట్టటంలో బాగా సమర్ధవంతంగా పనిచేస్తుంది.

Telugu Bacterial, Tips, Loose-Telugu Health - తెలుగు హెల్త

ఒక గ్లాస్ నీటిలో ఒక స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ వేసి బాగా కలిపి త్రాగితే మంచి ఉపశమనం కలుగుతుంది.రోజులో రెండు నుంచి మూడు సార్లు త్రాగాలి.

ఒక గ్లాస్ కొబ్బరి నీటిలో పావు స్పూన్ అల్లం పేస్ట్ కలిపి ఉదయం,సాయంత్రం రెండు సార్లు త్రాగితే డయేరియా సమస్య నుండి త్వరగా బయటపడవచ్చు.

ఒక కప్పు నీటిలో దాల్చినచెక్క,అల్లం వేసి బాగా మరిగించి వడకట్టి ఆ నీటిలో తేనే కలుపుకొని త్రాగితే సమస్య నుండి సులభంగా బయట పడవచ్చు.

అల్లం పేస్ట్ లో నిమ్మరసం కలిపి ఉదయం,సాయంత్రం తీసుకుంటే చాలా త్వరగా డయేరియా సమస్య నుండి బయట పడవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube