Sreemukhi : చిరు సినిమాలో క్రేజీ ఛాన్స్ కొట్టేసిన శ్రీముఖి.. ఇంతకు తనకు వచ్చినా అవకాశం ఏంటంటే?

శ్రీముఖి( Sreemukhi ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ప్రస్తుతం బుల్లితెరపై ఎక్కడ చూసినా తన హవానే నడుస్తుంది.

 Srimukhi Got A Crazy Chance In The Movie Chiru-TeluguStop.com

యాంకర్ గా మంచి క్రేజీ తెచ్చుకున్న ఈ హాట్ బ్యూటీ అన్ని ఛానల్స్ లలో ఏలేస్తూ ఆల్రౌండర్ గా నిలిచింది.అదుర్స్ షో తో తొలిసారిగా ఇండస్ట్రీకి పరిచయమైన శ్రీముఖి తొలి పర్ఫామెన్స్ తోని అందర్నీ ఆకట్టుకుంది.

వెండితెరపై కూడా పలు సినిమాల్లో సైడ్ ఆర్టిస్ట్ గా అవకాశాలు అందుకుంది.కానీ తనకు క్రేజ్ మాత్రం బుల్లితెరపైనే వచ్చింది.

బుల్లితెరపై ఇప్పటికి ఎన్నో షోలలో చేసి ఎనర్జిటిక్ యాంకర్ అని పేరు సంపాదించుకుంది.కేవలం ఈటీవీలోనే కాకుండా జీ ఫైవ్, స్టార్ మా ఇతర ఓటీటీ ఛానల్స్ లలో వరుస షోలు చేస్తూ మంచి అభిమానం సంపాదించుకుంది.

Telugu Biggboss, Bola Shankar, Chiranjeevi, Keerthy Suresh, Meher Ramesh, Tollyw

గంటలు తరబడి నిలబడిన కూడా షో ప్రారంభం నుండి చివరి వరకు అంతే ఎనర్జీగా కనిపిస్తూ ఫుల్ ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది.ఇక తన డాన్స్ పెర్ఫార్మెన్స్ తో కూడా బాగా అదరగొడుతుంది.ఇక చాలామంది ఈమెను బుల్లితెర రాములమ్మ అంటూ ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు.మొదట్లో సన్నగా ఉన్న శ్రీముఖి ఇప్పుడు బాగా బొద్దుగా మారింది.అయినా కూడా చూడటానికి చాలా అందంగా ఉంటుంది.సోషల్ మీడియా( Social media )లో కూడా బాగా యాక్టివ్ గా కనిపిస్తూ తన ఫోటోలతో రచ్చ చేస్తూ ఉంటుంది.

ప్రతిరోజు ఏదో ఒక ఫోటో షేర్ చేసుకుంటూనే ఉంటుంది.ప్రస్తుతం తను వరుస షో లలో బాగా బిజీగా ఉంది.

ఇక ఆ షోలలో ధరించే అవుట్ ఫిట్లను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ బాగా లైక్స్ అందుకుంటుంది.

Telugu Biggboss, Bola Shankar, Chiranjeevi, Keerthy Suresh, Meher Ramesh, Tollyw

కొందరు తనను బాగా ట్రోల్ చేస్తూ ఉంటారు.కానీ అవేవీ అస్సలు పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతూ ఉంటుంది.కాస్త సమయం దొరికితే చాలు ఫాలోవర్స్ ఓపికగా ముచ్చట్లు పెడుతూ ఉంటుంది.

ఏ ప్రశ్నలు అడిగినా కూడా మొహమాటం పడకుండా జవాబు ఇస్తూ ఉంటుంది.చాలావరకు ఆమెను పెళ్లి గురించి అడుగుతూ ఉంటారు.

ఇక వాటికి సరదాగా రిప్లై ఇస్తుంది కానీ తన మనసులో ఉన్న మాటలు మాత్రం బయటికి చెప్పదు.

అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా తను చిరు సినిమాలో ఒక మంచి అవకాశం అందుకున్నట్లు తెలిసింది.

ప్రస్తుతం చిరంజీవి మెహర్ రమేష్ దర్శకత్వంలో బోళా శంకర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.ఇందులో తమన్నా తో పాటు కీర్తి సురేష్ కూడా నటిస్తుంది.

ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పాటలు బాగా వైరల్ అవుతున్నాయి.

Telugu Biggboss, Bola Shankar, Chiranjeevi, Keerthy Suresh, Meher Ramesh, Tollyw

అయితే తాజాగా శ్రీముఖి ఈ సినిమాకు సంబంధించిన స్టోరీస్ పంచుకుంది.అందులో తను తన డబ్బింగ్ పూర్తయినట్లు పంచుకుంది.అంటే దీనిని బట్టి చూస్తే ఆ సినిమాలో తనకు డబ్బింగ్ చెప్పే అవకాశం వచ్చినట్లు అనిపిస్తుంది.

సినిమా విడుదలయ్యాక చూడాలి అందులో శ్రీముఖి పాత్ర ఉందా లేదా కేవలం డబ్బింగ్ మాత్రమే ఉందా అనేది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube