Amazing Benefits Of Lady Finger Water

సాధారణంగా బెండకాయ తో కూర, ఫ్రై, పులుసు వంటివి చేసుకుంటూ ఉంటాం.ఇవి ఎంతో రుచికరంగా ఉండటమే కాకుండా బెండకాయలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి.

 Amazing Benefits Of Lady Finger Water-TeluguStop.com

బెండకాయ నీటిని ప్రతి రోజు ఉదయం పరగడుపున త్రాగితే ఎన్నో ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు

రెండు బెండ‌కాయ‌లను తీసుకుని బాగా కడిగి మొద‌లు, చివ‌ర భాగాల‌ను క‌ట్ చేయాలి.ఆ తర్వాత ఒక్కో బెండ కాయను నిలువుగా చీరాలి.

కానీ పూర్తిగా చీర‌కూడ‌దు.చివ‌రి భాగం వ‌ర‌కు మాత్ర‌మే చీరి వ‌దిలేయాలి.

అలా రెండు బెండ‌కాయ‌ల‌ను క‌ట్ చేశాక ఒక గ్లాస్ నీటిని తీసుకుని అందులో వాటిని వేయాలి.ఆపై మూత పెట్టాలి.

రాత్రంతా ఆ నీటిని అలాగే ఉంచాక‌, ఉద‌యాన్నే ఆ గ్లాస్‌లోంచి బెండ‌కాయ‌ల‌ను తీసేసి ఆ నీటిని ప‌ర‌గ‌డుపునే తాగేయాలి.ఇలా చేయ‌డం వ‌ల్ల ఎన్ని ప్రయోజనాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం


1.బెండకాయలో ఫైబర్ సమృద్ధిగా ఉండుట వలన గ్యాస్ట్రో ఇన్ టెన్సినల్ ట్రాక్ కు బాగా సహాయపడుతుంది.బెండకాయ నీటిని త్రాగటం వలన గ్యాస్ సమస్యలు, కడుపుబ్బరం మరియు మలబద్దకం సమస్యలు దూరం అవుతాయి
2.

బెండకాయ నీటిని రెగ్యులర్ గా త్రాగటం వలన ప్రేగుల్లో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా చేరుతుంది .బెండకాయలో ఉండే విటమిన్ సి వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది
3.బెండకాయను కూరగా తిన్నా పచ్చిగా తిన్నా బెండకాయ నీటిని త్రాగిన బెండకాయలో ఉండే ఫైబర్ బ్లడ్ షుగర్ ను కంట్రోల్ చేస్తుంది
4.బెండకాయలో విటమిన్ ఎ, లూటిన్ , క్సాంథిన్ మరియు బీటా కెరోటిన్ కంటి ఆరోగ్యానికి బాగా సహాయపడుతుంది
5.బెండకాయ నీటిని త్రాగటం వలన బరువు తగ్గించుకోవచ్చు.శరీరంలో ఎక్కువ ఉన్న క్యాలరీలు కరుగుతాయి .ఇందులో చాలా తక్కువ క్యాలరీలుండటం వల్ల కొలెస్ట్రాల్ సమస్య ఉండదు
6.శరీరంలో టాక్సిన్స్ ను తొలగించటానికి సహాయపడుతుంది
7.చ‌ర్మం కాంతివంతంగా మారుతుంది.జుట్టు దృఢంగా, ఒత్తుగా పెరుగుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube