వీడియో: బైక్‌పై పిల్లోడు ఉన్నా.. స్టంట్స్ చేశాడు.. మండిపడుతున్న నెటిజన్లు..

ఇటీవల కాలంలో ఇండియన్ రోడ్లపై స్టంట్స్( Stunts ) చేస్తున్న వారి సంఖ్య బాగా పెరిగిపోతోంది.రోడ్లపై వేగంగా వెళ్లడం, స్టంట్స్ చేయడం చాలా ప్రమాదకరమని, కఠిన శిక్షలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నా యువకులు వినడం లేదు.

 Man Performs Dangerous Bike Stunts With Kid On Bike Viral Video Details, Viral-TeluguStop.com

తాజాగా ఒక వ్యక్తి బైక్‌పై ( Bike ) పిల్లోడిని కూర్చోబెట్టుకొని మరీ అత్యంత ప్రమాదకరమైన విన్యాసాలు చేశాడు.బైక్ హ్యాండిల్ వదిలేసి దానిపై నిల్చోవడం, వేగంగా వెళుతూ షార్ప్‌ టర్న్స్‌ తీసుకోవడం చేశాడు.

ఉత్తరప్రదేశ్‌లోని( Uttar Pradesh ) సీతాపూర్‌‌లో ఒక హైవేపై ఈ విన్యాసాలు చేయడం జరిగింది.ఒక చిన్న పిల్లాడు( Kid ) బండి మీద ఉన్నాడు కిందపడితే ప్రమాదం అని తెలిసినా అతడు అలాగే మూర్ఖంగా ప్రవర్తించాడు.బాధ్యతారాహిత్యంగా రైడ్ చేయడమే కాకుండా అడ్డంగా వచ్చిన ఒక ఎద్దుకు డ్యాష్ ఇవ్వబోయాడు.అదృష్టం కొద్దీ బండి ఎద్దుకు తగలలేదు.బండిపై బలంగా దూకుతూ దాన్ని సస్పెన్స్ విరిగిపోయేటట్లు చేశాడు.ఇతని వెనకే వస్తున్న మరో వ్యక్తి తన ఫోన్ కెమెరాలో దీన్ని రికార్డ్ చేశాడు.

అది సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తక్కువ సమయంలోనే వైరల్ అయింది.ఉత్తరప్రదేశ్ పోలీసుల( UP Police ) దృష్టికి కూడా వెళ్లింది.

బండి నెంబర్ గుర్తించి సదరు యువకుడిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు.

సరదా కోసం చేసే ఈ స్టంట్ చివరికి అమాయకుల ప్రాణాలను బలిగొంటాయని, ఒక కుటుంబాన్ని రోడ్డు మీద పడేస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు.అయితే ఈ బైక్ నెంబర్ ప్లేట్ క్లియర్ గా కనిపిస్తుంది.అది ఒక స్పెండర్ ప్లస్ బైక్.

దీని ఆధారంగా పోలీసులు చర్యలు తీసుకునే అవకాశం ఉంది.ఈ వీడియో చూసినవారు అతడికి భారీగా జరిమానా వేయాలని, మోటార్ సైకిల్ ని సీజ్‌ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

వైరల్ వీడియోను మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube