ఆ కమెడియన్ ను తలచుకుంటూ బ్రహ్మానందం ఎమోషనల్.. చూడటానికి రావద్దన్నాడంటూ?

తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ స్టార్ కమెడియన్ బ్రహ్మానందం( Brahmanandam ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.టాలీవుడ్ లో ఉన్న టాప్ కమెడియన్లలో బ్రహ్మానందం కూడా ఒకరు.

 Brahmanandam Emotional Comments On Late Actor Dharmavarapu Subramanyam Details,-TeluguStop.com

ఆయనకు రెండు తెలుగు రాష్ట్రాలలో బీభత్సమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది.ఆయన కామెడీ టైమింగ్ మాత్రం అదుర్స్ అని చెప్పవచ్చు.

పర్ఫెక్ట్ కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ ఉంటారు.దాదాపుగా వెయ్యికి పైగా సినిమాలలో నటించి స్టార్ కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు బ్రహ్మానందం.

సినిమాలలో ఆయన చేసే కామెడీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఇది ఇలా ఉంటే తాజాగా బ్రహ్మానందం దివంగత కమెడియన్ ధర్మవరపు సుబ్రహ్మణ్యం( Dharmavarapu Subramanyam ) గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.

Telugu Brahmanandam, Tollywood-Movie

అసలేం జరిగిందంటే… నాటకాల నుంచి సినీ రంగంలోకి అడుగుపెట్టారు ధర్మవరపు సుబ్రహ్మణ్యం.అంతే కాదు ఆయన ఒక మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా.సినిమాల్లోకి రాకముందు ఆయన చాలా వాణిజ్య ప్రకటనలకు తన వాయిస్ ఇచ్చారు ధర్మవరపు సుబ్రహ్మణ్యం.అలాగే వ్యవసాయ కార్యక్రమాలకు కూడా వాయిస్ ఇచ్చారు ధర్మవరకు దాదాపు 150, 200ల కార్యక్రమాలకు ధర్మవరపు తన వాయిస్ అందించారు.

ఆ తర్వాత సీరియల్స్ లోకి అడుగుపెట్టారు.ఇక ఆనందో బ్రహ్మ( Anando Brahma ) అనే సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఈ దిగ్గజ నటుడు.దర్శకుడిగా కూడా కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించారు.ఆ తర్వాత చాలా వరకు సినిమాలలో కమెడియన్ గా( Comedian ) నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

కానీ ఆయన 2013 డిసెంబరు 7 న అనారోగ్య కారణాలతో కన్నుమూశారు.అయితే బ్రహ్మానందంకు ధర్మవరపు సుబ్రహ్మణ్యంకు మధ్య మంచి అనుబంధం ఉండేది.

Telugu Brahmanandam, Tollywood-Movie

ఈ ఇద్దరూ మంచి స్నేహితులుగా ఉండేవారు.ధర్మవరపు చనిపోయిన తర్వాత బ్రహ్మానందం చాలా ఎమోషనల్ అయ్యారు.ఆయన గురించి మాట్లాడుతూ.ధర్మవరం సుబ్రహ్మణ్యంను నేను ధర్మన్న ( Dharmanna ) అని పిలిచేవాడిని.చనిపోయే ముందు నాకు ఫోన్ చేసి మాట్లాడాడు.ఫోన్ చేసి నాది ఒక చిన్న రిక్వెస్ట్ రా,నువ్వు నన్ను చూడటానికి రావొద్దురా నువ్వు నన్ను చూడలేవు.

ఇంతకుముందు నువ్వు చూసినట్టు నేను ఇప్పుడు లేను.నా పరిస్థితి బాలేదు.

నీ గుర్తుల్లో నేను ఎలా ఉన్నానో అలానే ఉండాలి రావొద్దు రా అన్నాడు.నేను రోజూ ప్రయత్నించేవాడిని వెళ్లి చూడాలని కానీ వొద్దు అని నన్ను ఆపే వాడు.

కాదు కాదు నేను వస్తాను అని పట్టు పడితే డిసెంబర్ నెలలో వద్దువుగాని రా అప్పటికి నేను కోలుకుంటాను బాగుంటాను.ఇంతకు ముందులా యాక్టివ్ గా ఉంటాను అన్నాడు.

అలాగే నీకోసం ఒక పద్యం పడతాను అని ఒక పద్యం పాడాడు.నేను త్వరగానే వచ్చేస్తా.

మనం అందరం మళ్లీ కలిసి నటిద్దాం అని చెప్పారు అంటూ ఫుల్ ఎమోషనల్ అయ్యారు బ్రహ్మానందం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube