ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ లోయలో పడిపోయిన యువతి.. చికిత్స పొందుతూ మృతి..!

ఇటీవల కాలంలో రీల్స్( Reels ) కోసం మంది ప్రాణాలను పణంగా పెడుతున్నారు.కొందరైతే ఈ రీల్స్ చేస్తూ ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు తాజాగా 25 ఏళ్ల యువతి కూడా దురదృష్టం కొద్దీ లోయలో పడిపోయి మరణించింది.

 Travel Influencer Aanvi Kamdar Dies After Falling Into 300 Ft Gorge Details, Mum-TeluguStop.com

ఆమె ఒక పాపులర్ ట్రావెల్ ఇన్‌ఫ్లుయెన్సర్.( Travel Influencer ) పేరు ఆన్వీ కామ్దార్.

( Aanvi Kamdar ) ముంబై స్వస్థలం.ఆమె మంగళవారం (జులై 16) ప్రమాదవశాత్తు మరణించింది.

మహారాష్ట్రలోని రాయగఢ్‌కు సమీపంలో ఉన్న కుంభే జలపాతం( Kumbhe Waterfall ) వద్ద ఇన్‌స్టాగ్రామ్ రీల్ షూటింగ్ చేస్తుండగా కాలు జారి 350 అడుగుల లోతు ఉన్న లోయలో పడిపోయింది.

ఆమె స్నేహితులతో కలిసి జలపాతం వద్ద షూటింగ్ చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.సమాచారం అందుకున్న వెంటనే అధికారులు భారీ రెస్క్యూ ఆపరేషన్‌ను ప్రారంభించారు.కోస్ట్ గార్డ్, స్థానిక రెస్క్యూ టీంలు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి.

దురదృష్టవశాత్తు, రెస్క్యూ టీమ్‌ ఆమెను లోయ నుంచి బయటకు తీసుకువచ్చినప్పటికీ, ఆమె చికిత్స సమయంలో మరణించారు.

6 గంటలకు పైగా జరిగిన రెస్క్యూ ఆపరేషన్( Rescue Operation ) తర్వాత ఆన్వీని లోయ నుంచి బయటకు తీసుకొచ్చారు.ఆమెను రక్షించే సమయంలో వారిపై పెద్ద రాళ్లు దిగివచ్చాయి.ఆమె మరణించి ఉండవచ్చని రెస్క్యూ టీం సభ్యులు మొదట భావించారు.

కానీ, ఆమె శ్వాస తీసుకుంటున్నట్లు గమనించారు.చిన్నగా మాట్లాడుతున్నట్లు కూడా గుర్తించారు.

పడిపోవడం వల్ల ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయి.రెస్క్యూ టీం ఆమెను లోయ నుంచి స్ట్రక్చర్‌పై పడుకోబెట్టి ఆపై తాడుతో ఆమెను పైకి లేపారు.

సమీపంలోని మనగావ్ తాలూకా ప్రభుత్వాసుపత్రికి తరలించారు.అయితే, చికిత్స సమయంలో ఆమె తుది శ్వాస విడిచింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube