అమెరికా : జాహ్నవి కందుల మరణంపై హేళన .. ఆ పోలీస్ అధికారిని తొలగించిన ప్రభుత్వం

అమెరికాలో గతేడాది పోలీస్ పెట్రోలింగ్ వాహనం ఢీకొని తెలుగు యువతి జాహ్నవి కందుల( Jaahnavi Kandula ) మరణించిన ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.ఆమె కుటుంబంలో తీవ్ర విషాదానికి కారణమైన ఈ ఘటనపై సానుభూతి చూపించాల్సిందిపోయి జాహ్నవి మరణంపై డేనియల్ అడెరెర్( Daniel Auderer ) అనే ఓ పోలీస్ అధికారి జోకులు వేశాడు.

 Us Policeman Who Laughed After Indian Student Jaahnavi Kandula Death Fired Detai-TeluguStop.com

అతని వైఖరి భారత్, అమెరికాలలో తీవ్ర దుమారం రేపింది.జాహ్నవి మరణంపై సదరు పోలీస్ అధికారి జోకులు వేసుకుంటూ , నవ్వుతూ మాట్లాడిన దృశ్యాలు అతని శరీరానికి అమర్చిన బాడీ కామ్ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.

Telugu Daniel Auderer, Danielauderer, Indian, Seattle, Policeman, Policeman Fire

అవి కాస్తా వెలుగులోకి రావడంతో జాహ్నవి కుటుంబ సభ్యులు, మిత్రులతో పాటు భారత ప్రభుత్వం, అమెరికాలోని భారతీయ కమ్యూనిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.సదరు అధికారిపై చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వం గతంలోనే అమెరికాను( America ) కోరింది.అప్పట్లోనే ఆ పోలీస్‌ను అధికారులు సస్పెండ్ చేయగా.ఈసారి ఏకంగా ఉద్యోగంలో నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు.డేనియల్ మాటలు జాహ్నవి కుటుంబ సభ్యుల మనసును గాయపర్చేలా ఉండటంతో పాటు సీటెల్ పోలీస్ శాఖకు( Seattle Police Department ) మాయని మచ్చ తెచ్చాయని పోలీస్ చీఫ్ సూ రహర్ వ్యాఖ్యానించారు.ఆయన కారణంగా పోలీసులు విధులు మరింత కఠినంగా మారాయని పేర్కొన్నారు.

Telugu Daniel Auderer, Danielauderer, Indian, Seattle, Policeman, Policeman Fire

కాగా.కర్నూలు జిల్లాకు చెందిన జాహ్నవి కందుల నార్త్ ఈస్ట్ యూనివర్సిటీలోని( North East University ) కాలేజ్ ఆఫ్ ఇంజనీరిగ్‌లో ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్‌లో మాస్టర్ ఆఫ్ సైన్స్ చదివేందుకు 2021లో అమెరికాకు వెళ్లారు.ఈ క్రమంలో గతేడాది జనవరి 23న జాహ్నవి రోడ్డు దాటుతుండగా పోలీస్ వాహనం దూసుకొచ్చి ఆమెను ఢీకొట్టింది.ఈ సమయంలో వాహనంలోనే డేనియల్ ఉన్నాడు.ఫాక్స్ సీటెల్ వార్తా సంస్థ కథనం ప్రకారం.జాహ్నవిని డెక్స్‌టర్ అవెన్యూ నార్త్ , థామస్ స్ట్రీట్ కూడలి వద్ద కారు ఢీకొట్టింది.

తీవ్ర గాయాలైన ఆమెను స్థానికులు, పోలీస్ అధికారులు హార్బర్ వ్యూ మెడికల్ సెంటర్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది.

జాహ్నవి భౌతికకాయాన్ని భారతదేశానికి తరలించేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘‘తానా’’ అండగా నిలిచింది.

జనవరి 29న ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ విమానంలో మృతదేహాన్ని హైదరాబాద్‌కు అక్కడి నుంచి ఆదోనీకి పంపారు.అలాగే జాహ్నవి కుటుంబానికి అండగా నిలిచేందుకు గాను ఆమె స్నేహితులు ‘‘గో ఫండ్ మీ’’ ద్వారా నిధుల సమీకరణ చేపట్టారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube