ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రజలకు దగ్గరయ్యే విధంగా అనేక నిర్ణయాలు వెలువడుతున్నాయి.ముఖ్యంగా పార్టీలోనూ ప్రభుత్వంలోనూ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్( Minister Nara Lokesh ) తరుచుగా వైసీపీని టార్గెట్ చేసుకుంటూ సందర్భం వచ్చినప్పుడల్లా విమర్శలతో విరుచుకుపడుతున్నారు.
గత వైసీపీ ప్రభుత్వ హయంలో జరిగిన అవినీతి వ్యవహారాలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ విమర్శల వర్షం కురిపిస్తున్నారు.ముఖ్యంగా వైశీపీలోని కీలక నాయకులను లోకేష్ టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేస్తున్న లోకేష్ తాజాగా తనదైన శైలిలో సెటైర్లు వేశారు.
![Telugu Ap, Janasena, Lokesh, Ysrcp-Politics Telugu Ap, Janasena, Lokesh, Ysrcp-Politics](https://telugustop.com/wp-content/uploads/2024/07/Nara-Lokesh-TDP-janasena-BJP-ysrcp-ap-government-AP-government-CBN-ap-politics.jpg)
హింస, విధ్వంసం , అరాచకం , అన్యాయం, అవినీతి గురించి జగన్ మాట్లాడటం వింతగా ఉందని నారా లోకేష్ విమర్శించారు.‘ రాష్ట్రంలో బాధితులని నిందితులుగా చేసిన చీకటి రోజులు పోయి నెల దాటింది.కూటమి ప్రభుత్వం మిగిలిన ఆ అరాచకపు ఆనవాళ్లను కూడా కూకట్వేళ్లతో పెకలించేస్తోంది.ప్రజా తీర్పుతో ఉనికి కోల్పోయిన జగన్ అసత్య ప్రచారాలతో, అబద్ధపు పునాదులపై మళ్ళీ నిలబడాలని చూస్తున్నారు.
రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా హత్యా రాజకీయాలంటూ ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు.
![Telugu Ap, Janasena, Lokesh, Ysrcp-Politics Telugu Ap, Janasena, Lokesh, Ysrcp-Politics](https://telugustop.com/wp-content/uploads/2024/07/ys-jagan-Nara-Lokesh-TDP-janasena-BJP-ysrcp-ap-government-AP-government-CBN-ap-politics.jpg)
శవాలతో రాజకీయాలు చేసే మీ విష సంస్కృతికి ప్రజలు ఇచ్చిన తీర్పే మొన్నటి ఎన్నికల ఫలితాలు అని ఇంకా అర్థం చేసుకోకపోతే మళ్లీ వాటిని వేరే వారిపై నెట్టడం అనే మీ కపట నాటకాలకు కాలం చెల్లింది.ప్రజల రక్షణకు కట్టుబడి ఉన్నాం .ఏ ఘటనను ఉపేక్షించం , ఏ నిందితుడిని వదిలేది లేదు.బెంగళూరు ప్యాలస్ లో కూర్చుని ఇక్కడ కుట్రలు అమలు చేయాలంటే కుదరదు. మీ హెచ్చరికలకు భయపడే ప్రభుత్వం కాదు. ప్రజలకు జవాబుదారీగా ఉండే ప్రజా ప్రభుత్వం ,’ అంటూ లోకేష్ తనదైన శైలిలో సోషల్ మీడియా వేదికగా జగన్ పై విమర్శల బాణాలు వదిలారు.