తనికెళ్ల భరణి( Tanikella Bharan ) టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి నటుడిగా, ప్రతిభ గల రచయితగా పేరు తెచ్చుకున్నాడు.ఈ యాక్టర్ మనసులో ఏది ఉంటే అది బయటకు చెప్పేస్తుంటాడు.
ఇంటర్వ్యూల్లో కూడా ఎలాంటి దాపరికాలు లేకుండా మాట్లాడతాడు.ఓసారి ఓ ప్రముఖ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అలనాటి హీరోయిన్ రేఖ( Rekha ) అంటే తనకు పిచ్చి అని చెప్పాడు.
చీరకట్టులో కనిపించే ఆమె అంటే తనకు ఎంతో ఇష్టమని తెలిపాడు.యుక్త వయసులో ఆమెను వన్ సైడ్ లవ్ చేసినట్లు కూడా వెల్లడించాడు.

ఏవైనా ఫంక్షన్లు చేసేటప్పుడు రేఖ వస్తే బాగుంటుందని కూడా కోరుకునే వాడట.ఒకసారి ప్రకాష్ రాజ్ ద్వారా ఆమెను ఓ ఫంక్షన్ కు కావాలంటూ కబురందించాడు కానీ ఆమె రాలేదట.ఈ విషయాన్ని స్వయంగా అతడే ఒప్పుకున్నాడు.తనికెళ్ల భరణి “నక్షత్ర దర్శనమ్” పేరిట సినిమా వాళ్ల పర్సనాలిటీల గురించి ఒక పోయటిక్ బుక్ రాశాడు.దాని ఆవిష్కరణకు సీనియర్ ఎన్టీఆర్ లాంటి గొప్పవారు కూడా వచ్చారు.అందులో రేఖ గురించి కూడా తనికెళ్ల భరణి రాశాడు.
అందుకే ఆమెను పుస్తకావిష్కరణకు పిలిపించినట్లు పిలిపించి ఆమెను చూడాలని అనుకున్నాడు.రేఖకు తెలుగు వచ్చు కాబట్టి వస్తుందేమో అనుకున్నాడు కానీ అది జరగలేదు.
దీని కారణంగా అతనేం బాధపడలేదు.గ్యాప్ ఉంటేనే ఇంకా ఎక్కువ రోజులు ఆమెను లవ్ చేయగలనని అనుకున్నాడు.

చలం దర్శకత్వం( chalam )లో రేఖతో కలిసి చాలా సినిమాలు తీయాలనే కోరిక తనకు ఉండేదని కూడా అన్నాడు.సౌందర్య, సావిత్రి లాంటి హీరోయిన్లను చూస్తే అప్రయత్నంగానే తన చేతులు దండం పెట్టేస్తాయని కానీ రేఖను చూస్తే చిలిపి కోరికలు పుడతాయని తనికెళ్ల భరణి హాట్ హాట్ కామెంట్స్ చేశారు.శారీరకంగా వేరే వారిపై మనసు మళ్లినా మానసికంగా రేఖపైనే ప్రేమ పుట్టేదని చెప్పుకొచ్చారు.ఇకపోతే రేఖ 180కి పైగా సినిమాల్లో నటించింది.చాలా ఛాలెంజింగ్ రోల్స్ పోషించి ఆకట్టుకుంది.రేఖ జాతీయ చలనచిత్ర అవార్డు, నాలుగు ఫిల్మ్‌ఫేర్ అవార్డులతో సహా అనేక అవార్డులను గెలుచుకుంది.
ఆమె కెరీర్లో కొన్ని హెచ్చు తగ్గులు ఉన్నప్పటికీ ఆమె స్టార్ హీరోయిన్ హోదాను నిలబెట్టుకోగలిగింది, 2010లో ఆమె చలనచిత్ర రంగానికి చేసిన కృషికి భారతదేశపు అత్యున్నత పురస్కారాలలో ఒకటైన పద్మశ్రీ అవార్డును అందుకుంది.ఈమెపై తనికెళ్ల భరణి మాత్రమే కాదు చాలామంది మనసు పారేసుకున్న సెలబ్రిటీలు ఉన్నారు.