ఈ రెండిటిని తీసుకుంటే నెల రోజుల్లో నాజూగ్గా మారతారు.. తెలుసా?

ఇటీవల రోజుల్లో బ‌రువు తగ్గడం కోసం ప్రయత్నిస్తున్న వారి సంఖ్య అంతకంతకు పెరిగిపోతుంది.అధిక బరువు వల్ల శరీర ఆకృతి దెబ్బతింటుంది.

 If You Take These Two, You Will Become Slim In A Month! Pineapple, Moringa Leave-TeluguStop.com

అదే సమయంలో ఎన్నో అనారోగ్య సమస్యలు సైతం చుట్టుముడతాయి.అందుకే పెరిగిన బ‌రువును తగ్గించుకోవడం కోసం ముప్పతిప్పలు పడుతుంటారు.

మీరు ఈ జాబితాలో ఉన్నారా? అయితే ఇకపై అస్సలు చింతించకండి.ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే రెండిటిని తీసుకుంటే నెల రోజుల్లో నాజూగ్గా మారతారు.

ఆ రెండు ఆహారాలు మరేమిటో కాదు మునగాకు, పైనాపిల్.ఈ రెండిటిని ఇప్పుడు చెప్పబోయే విధంగా తీసుకుంటే ఎంత లావుగా ఉన్నా సరే సన్నగా మారతారు.మరి ఇంకెందుకు ఆలస్యం బరువు తగ్గాలంటే పైనాపిల్, మునగాకుని ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం పదండి.ముందుగా ఒక చిన్న పైనాపిల్ ను తీసుకుని తొక్క చెక్కేసి నీటిలో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

అలాగే అరకప్పు మునగాకు నీటిలో శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి.

ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న పైనాపిల్ ముక్కలు మరియు మునగాకు వేసుకోవాలి.అలాగే ఒక గ్లాస్ వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుండి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.

ఈ పైనాపిల్ మునగాకు జ్యూస్ లో వన్ టేబుల్ స్పూన్ తేనె కలిపి సేవించాలి.

ఈ జ్యూస్ లో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఈ, క్యాల్షియం, ప్రోటీన్, ఫైబర్ తో సహా ఎన్నో పోషకాలు నిండి ఉంటాయి.ఈ జ్యూస్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే మెటబాలిజం రేటు రెట్టింపు అవుతుంది.క్యాలరీలు వేగంగా కరుగుతాయి.

దాంతో సూపర్ ఫాస్ట్ గా బరువు తగ్గుతారు.అంతేకాదు ఈ జ్యూస్ ను తీసుకోవడం వల్ల హార్మోనల్ బ్యాలెన్స్ జరుగుతుంది.

పీసీఓడీ సమస్య నుంచి బయటపడతారు.థైరాయిడ్ అదుపులో ఉంటుంది.

బ్లడ్ షుగర్ లెవెల్స్‌ కంట్రోల్ తప్పకుండా ఉంటాయి.మరియు ఇమ్యూనిటీ సిస్టమ్‌ సైతం బూస్ట్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube