తమిళ్ సినిమా ( Tamil movie )ఇండస్ట్రీలో ఉన్న చాలామంది నటులలో చాలా కాలం పాటు కమెడియన్ గా కొనసాగిన నటుడు వడివేలు.అయితే అప్పట్లో ఈయన క్రేజ్ తమిళం లో తార స్థాయిలో ఉండేది.
రజనీకాంత్( Rajinikanth ) లాంటి స్టార్ హీరో సైతం వడివేలు డేట్స్ ఇస్తేనే నేను కూడా డేట్స్ ఇస్తాను అని చెప్పేంత రేంజ్ లో స్టార్ డమ్ ని అయితే సంపాదించుకున్నాడు.అయితే అనుకోకుండా ఆయన ఇండస్ట్రీ నుంచి ఎందుకు ఫేడ్ అవుట్ అవాల్సి వచ్చింది అంటే అప్పటి సీఎం అయిన జయలలిత కి వ్యతిరేకంగా అపోజిషన్ పార్టీ తరఫున ఆయన ప్రచారానికి దిగడం జరిగింది.

అవన్నీ వింటూ కూర్చున్న జయలలిత ( Jayalalithaa )ఎలక్షన్ లో గెలిచింది.అయితే వడివేలు ఎక్కడైతే అపోజిషన్ పార్టీ తరపున ప్రచారానికి దిగాడో అక్కడ మాత్రం జయలలిత నిలబెట్టిన అభ్యర్థులు ఓడిపోవడం జరిగింది.వడివేలు మీద టార్గెట్ చేసిన జయలలిత దగ్గరికి వెళ్లి ఇక మీదట నుంచి వడివేలు ని ఏ సినిమాలో తీసుకుంటే ఆ సినిమా సెన్సార్ అవ్వదు,రిలీజ్ అవ్వదు అని ప్రొడ్యూసర్స్ అందర్నీ బెదిరించడం జరిగింది.దాంతో ఆవిడ మాటలకు భయపడి పోయిన ప్రొడ్యూసర్లు వడివేలును సినిమా నుంచి తప్పించారు.

అలా వడివేలు సినిమా కెరియర్ అనేది మధ్యలోనే ముగిసిపోయింది.దాంతో ఆయన చాలా సంవత్సరాల పాటు సినిమాలు చేయకుండా ఖాళీ గానే ఉండిపోయారు.ఇక ఆ టైం లో రజనీకాంత్ వడివేలు( Vadivelu ) తో మాట్లాడి కొద్ది రోజులు ఉండు నేను అందరితో మాట్లాడి మళ్ళీ నీకు ఆఫర్స్ వచ్చేలా చేస్తాను అని చెప్పాడట అయితే రజినీకాంత్ అందరితో మాట్లాడిన కూడా ప్రయోజనం ఏమీ లేకుండా పోయింది…ఇక ఆ తర్వాత గవర్నమెంట్ మారడంతో ఆయన మళ్ళీ సినిమాల్లో నటిస్తూ నటుడుగా మంచి గుర్తింపును తెచ్చుకుంటున్నాడు.వడివేలు చేసిన వ్యాఖ్యల వల్లే ఆయన కెరియర్ అనేది ముగిసిపోయింది అంటూ ఇండస్ట్రీ లో ఉన్న చాలామంది ఇప్పటికి ఆయనని ఒక ఎగ్జాంపుల్ గా చూపిస్తూ పొలిటిషియన్స్ తో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్తూ ఉంటారు…
.