అమెజాన్ అడవిలో సంచరిస్తున్న ఓ అరుదైన తెగ ఇదే?

ఈ భూ ప్రపంచంలో నాగరికతకు చాలా దూరంగా, సామాన్యుడి కంటికి కనిపించనంత సీక్రెట్ గా నివసిస్తున్న తెగలు ఎన్నో ఉన్నాయి.అమెజాన్ అడవుల్లోAmazon Rainforest ) కూడా చాలా రకాల తెగ ప్రజలు ఉన్నారని అంటారు.

 Is This A Rare Tribe Roaming In The Amazon Forest, A Tribe, That Wanders , The-TeluguStop.com

వీరిని చూస్తేనే భయం కలుగుతుంది.తాజాగా ఈ అడవిలో సంచరించే ఒక తెగ ప్రజల వీడియో సోషల్ మీడియా( Social media )లో వైరల్ గా మారింది.

వీరు సాధారణంగా కెమెరాలకు దొరకరు.ఒక సంస్థ ఈ అరుదైన తెగ ప్రజలను కెమెరాలో తెలివిగా క్యాప్చర్ చేయగలిగింది.

Telugu Tribe, Peruvianamazon, Wanders, Amazon-Latest News - Telugu

పెరువియన్ అమెజాన్‌( Peruvian Amazon )లో వీళ్లు నివసిస్తుంటారు.ఈ తెగను మాష్కో పైరో అని పిలుస్తారు.సర్వైవల్ ఇంటర్నేషనల్ అనే ఇండిజినస్ రైట్స్ అడ్వకసీ గ్రూప్ ఈ తెగ ప్రజల గురించిన వివరాలను, వీడియోలను విడుదల చేసింది.ఆ గ్రూప్ ప్రకారం ఈ తెగ ప్రజలకు, బయట ప్రపంచానికి ఎలాంటి సంబంధం ఉండదు.

వీళ్లు ఓన్లీ అడవుల్లోనే నివసిస్తారు.పెరు దేశానికి సమీపంలో ఉన్న లాస్ పీడ్రాస్ రివర్ దగ్గర వీళ్లు బతుకుతున్నారు.

Telugu Tribe, Peruvianamazon, Wanders, Amazon-Latest News - Telugu

ఈ తెగ ప్రజలు ఇక్కడే ఉన్నారా లేదా అనే అనుమానం అధికారుల్లో మొన్నటిదాకా తొలగిపోలేదు.అయితే వీళ్ళు వీడియోకి చిక్కాక ఆ డౌట్ క్లియర్ అయింది.ఇప్పుడు వారు అక్కడే ఉంటున్నట్లు బలమైన సాక్ష్యాలు లభించాయి.ఈ ప్రాంతాన్ని ప్రొటెక్ట్ చేయడంలో గవర్నమెంట్ పూర్తిగా ఫెయిల్ అయిందని విమర్శలు వస్తున్నాయి.ఆ ప్రాంతాన్ని వేరే వ్యక్తులకు అమ్మినట్లు కూడా విమర్శలు వచ్చాయి.ఆహారం కోసం అన్వేషిస్తున్నప్పుడు ఈ తెగ కెమెరాల కంటికి చిక్కినట్లుగా అధికారులు తెలిపారు.

ఇదే ప్రాంతానికి సమీపంలో మోంటే సాల్వడో, ప్యూర్టో న్యూవో వంటి గ్రామాలు ఉన్నాయి.ఈ గ్రామాల ప్రజలు ఆ తెగ ప్రజలకు మధ్య కొట్లాటలు జరిగే ప్రమాదం ఉందని అధికారులు భావిస్తున్నారు ఎందుకంటే ఒక ప్రాంతాన్ని వారు ఆక్రమించేస్తారు అందులోకి ఇతరులు వస్తే ఆహార వనరుల కొరత ఏర్పడుతుందని భయపడతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube