అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ అందేలా పకడ్బందీ చర్యలు::జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రుణమాఫీ పథకం(Rythu Runa Mafi ) మన జిల్లాలో అర్హులైన ప్రతి రైతుకు వర్తించేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు.గురువారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ సమీకృత జిల్లా కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో రైతు రుణ మాఫీ పై బ్యాంకర్లుతో సమీక్ష నిర్వహించి జిల్లాలో ఉన్న రైతు రుణాల వివరాలు బ్యాంకుల వారీగా, వ్యవసాయ సహకార సంఘాల వారీగా కలెక్టర్ తెలుసుకున్నారు.

 Armed Measures To Ensure Loan Waiver To Every Eligible Farmer::district Collecto-TeluguStop.com

ఈ సమీక్షలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మొదటి విడత కింద మన జిల్లాలో లక్ష రూపాయల లోపు రుణం తీసుకున్న 23 వేల 986 మంది రైతుల రుణాల సోమ్మును ప్రభుత్వం ఈ రోజు జమ చేస్తుందని, సంబంధిత రైతులకు రైతు రుణమాఫీ సొమ్ము చేరేలా బ్యాంకులు వ్యవసాయ అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ సూచించారు.

మొదటి దశలో జరుగుతున్న రుణమాఫీ లబ్ధిదారుల జాబితా, పూర్తి స్థాయి లబ్ధిదారుల జాబితాతో లీడ్ బ్యాంకు మేనేజర్ బ్యాంకు వారీగా రీకన్సైల్ చేయాలని, లీడ్ బ్యాంక్ మేనేజర్ కు పూర్తి స్థాయిలో బ్యాంకులు సమాచారం అందజేయాలని కలెక్టర్ పేర్కొన్నారు.

ప్రతి మండల కేంద్రంలో బ్యాంకర్లు, వ్యవసాయ అధికారులతో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని, వ్యవసాయ సహకార సంఘాల బ్యాంకుల ద్వారా రైతులు చేసిన రుణాలను సైతం ప్రభుత్వం మాఫీ చేస్తుందని, ప్రభుత్వం విడుదల చేసిన రుణమాఫీ సోమ్ము వినియోగం పై, ఫెయిల్డ్ ట్రాన్సాక్షన్ వివరాలు ప్రతిరోజు రిపోర్టును అధికారులు అందజేయాలని కలెక్టర్ సూచించారు.

వ్యవసాయ శాఖ తరపున సీనియర్ అధికారిని జిల్లాలో రుణమాఫీ గురించి వివరాలు అధికారిగా కేటాయించి ప్రభుత్వం విడుదల చేసిన సొమ్ము సాఫీగా రైతులకు చేరేలా చూడాలని, ప్రతి మండల కేంద్రంలో బ్యాంకర్లు వ్యవసాయ అధికారులతో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసి రుణమాఫీకి సంబంధిత వచ్చే ఫిర్యాదులను 30 రోజులలో పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు.

ఈ సమావేశంలో ఎల్.డి.ఎం.మల్లికార్జున్, డి.ఏ.ఓ.భాస్కర్, యు.బి.ఐ,ఏ.జి.ఎం.సురేష్, ఎస్.బి.ఐ, చీఫ్ మేనేజర్ రామచంద్రుడు, కే.డి.సి.సి,డి.జి.ఎం.రోహిణి, టీ.జి.ఎం.అర్.ఓ, రవి, బ్యాంకర్లు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube