తెలుగు సినిమా పరిశ్రమలో తిరుగులేని హీరోగా కొనసాగుతున్నాడు అల్లు అర్జున్.ఇప్పటికే పలు సినిమాలతో మంచి ఫామ్ లో ఉన్న ఈ సిక్స్ ఫ్యాక్ కుర్రాడు.
ప్రస్తుతం మరింత సక్సెస్ ఫుల్ గా కెరీర్ ముందుకు కొనసాగిస్తున్నాడు.తాజాగా తను నటించి అల వైకుంఠపురంలో సినిమాతో యంగ్ హీరోల్లో బన్నీ టాప్ లో కొనసాగుతున్నాడు.
అయితే ఈ హీరో.గంగోత్రి సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు.
ఆయన కొంత కాలం క్రితం స్నేహారెడ్డిని ప్రేమ పెళ్లి చేసుకున్నాడు.అయితే వర కట్నం కింది అల్లు అర్జున్ కు ఆయన మామ భారీగా డబ్బు ముట్టజెప్పినట్లు తెలిసింది.సుమారు రూ.300 కోట్లు అప్పగించినట్లు సమాచారం.ఇందులో పలు స్థిర, చరాస్తులు ఉన్నట్లు తెలుస్తోంది.
తన ప్రేమ విషయాన్ని బన్నీ ఇంట్లో తొలుత తన అమ్మకు చెప్పాడట.
ఆ తర్వాత ఇంట్లో వారికి విషయం చెప్పాడట.అయితే వీరి ప్రేమకు కుటుంబ సభ్యులు ఓకే చెప్పారట.
బన్నీ ప్రేమ పెళ్లి పీఠల వరకు వెళ్లడంలో తన తల్లి పాత్ర కీలకం అయ్యిందట.ఆమె సరే అని చెప్పడంతో పాటు కుటుంబ సభ్యులు అందరి చేత ఓకే చెప్పించిందట.
అటు అమ్మాయి తరుఫున వాళ్లు కూడా వీరి ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇద్దరూ మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారట.

అటు అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి టీఆర్ఎస్ నాయకుడు.సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు.కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి విద్యాసంస్థలకు అధినేత.
వీళ్లకు చాలా విద్యా సంస్థలు ఉన్నాయి.బన్నీ ఆ విద్యా సంస్థలకు డైరెక్టర్ గా ఉన్నాడు.
ఆ సమయంలోనే స్నేహ.బన్నీ మధ్య ప్రేమ ఏర్పడిందట.ఆ తర్వాత కుటుంబ సభ్యుల సమ్మతితో 2011లో ఒక్కటయ్యారు.2014లో ఇబ్రహీంపట్నం టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు చంద్రశేఖర్ రెడ్డి.నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో సైతం ఆయన పోటీకి దిగే అవకాశం ఉన్నట్లు వార్తలు వచ్చాయి.కానీ అది సాధ్యం కాలేదు.