ఇటీవల కాలంలో సినిమా థియేటర్ కు ప్రేక్షకులను రప్పించాలంటే ఏ కత్తి మీద సాముల మారింది పరిస్థితి.సినిమాలో కొత్తదనం లేకపోతే జనాలకు ఆసక్తి కలగడం లేదు.
ప్రతిసారి కొత్తదనం కావాలంటే ఎలా కుదురుతుంది చెప్పండి.అయితే ఇటీవల కాలంలో మన తెలుగు దర్శకులు ఎక్కువగా ప్రాంతీయ భాష పైన సినిమాలు తీయడానికే మొదటి ప్రాధాన్య తీస్తున్నారు ఒకరి భాష మరొకరికి కొత్తదనంగా ఉంటుంది.
అలాగే థియేటర్ కు కూడా జనాలు క్యూ కడుతున్నారు.అలా తెలంగాణ భాషలో, యాసలో డైలాగులు ఉండడంతో కొత్తగా కనిపించి అనేక సినిమాలు హిట్ అవుతున్నాయి.
అలా ప్రియదర్శి మొదలు రవితేజ వరకు తెలంగాణ స్లాంగ్ లో నటించి హిట్టు కొట్టిన ఆ హీరోలు ఎవరు? ఆ సినిమాలు ఏంటో తెలుసుకుందాం.
వకీల్ సాబ్
పవన్ కళ్యాణ్ చాలా రోజుల గ్యాప్ తీసుకొని నటించడం వకీల్ సాబ్( Vakeel Saab ) సినిమాలో ప్రాంతీయ భాష ఆయన తెలంగాణ స్లాంగ్ బాగా వర్కౌట్ అయింది ఆయన తెలంగాణ భాషలో చెప్పిన డైలాగులకు జనాలు బ్రహ్మరథం పెట్టారు.
జాతి రత్నాలు
కమెడియన్స్ హీరోగా మారి తీసిన చిత్రం జాతి రత్నాలు( jathi ratnalu ).ఇందులో నవీన్ పోలిశెట్టి మెయిన్ లీడ్ లో నటించగా ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ హీరోకి సపోర్టింగ్ పాత్రలో నటించారు.ఈ పాత్రలు తెలంగాణ యాస మాట్లాడడంతో సినిమా మంచి విజయాన్ని అందుకుంది.
బలగం
ఈ మధ్యకాలంలో వచ్చిన అతి చిన్న సినిమా బలగం( Balagam ) పూర్తిస్థాయిలో తెలంగాణ నేపథ్యంలో, తెలంగాణ సంస్కృతి ఆధారంగా తెరకెక్కింది.ఈ చిత్రం జనాలకు చాలా కొత్తగా అనిపించడంతో మంచి విజయాన్ని దక్కించుకుంది.
లవ్ స్టోరీ
నాగచైతన్య సాయి పల్లవి జంటగా నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.అందుకు ప్రధాన కారణం తెలంగాణ యాస అని చెప్పక తప్పదు.ఈ సినిమాలో నాగచైతన్య తెలంగాణ యాస మాట్లాడుతుంటే చూడ్డానికి చాలా చక్కగా ఉంటుంది.
డిజే టిల్లు
సిద్దు జొన్నల కట్ట హీరోగా నటించిన ఈ చిత్రం సైతం మంచి తెలంగాణ యాసలో ఉండటంతో పాటు కామెడీ కూడా బాగా వర్కౌట్ కావడంతో ఘనవిజయాన్ని అందుకుంది.
ఆర్ ఆర్ ఆర్
ప్రపంచ స్థాయి దర్శకుడు రాజమౌళి( rajamouli ) సైతం తెలంగాణ యాసనే నమ్ముకోవడం విశేషం.ఆయన ఇటీవల తీసిన ట్రిపుల్ ఆర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ తెలంగాణ యాసలోనే మాట్లాడాడు.
వాల్తేరు వీరయ్య
చిరంజీవి రీసెంట్ గా నటించిన వాల్తేరు వీరయ్య సైతం మంచి విజయాన్ని అందుకుంది.అందులో చిరంజీవి తెలంగాణ యాసలో మాట్లాడుతూ కామెడీతో అదరగొట్టడంతో చాలా సునాయాసంగా ఈ చిత్రం విజయాన్ని దక్కించుకుంది.