ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆఖరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి.పొలిటికల్ సెకండ్ ఇన్నింగ్స్ కి ముహూర్తం, స్టేజ్ అన్నీ రెడీ అయిపోయాయి! అయితే, పాలిటిక్స్‌లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరన్న వ్యాఖ్యలను కిరణ్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా నిజం చేశారు.
గతంలో తాను సీఎంగా ఉండగా.పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించిన దివంగత సీఎం వైఎస్ తనయుడు జగన్ పార్టీ వైకాపాలోకే ఇప్పుడు కిరణ్ జంప్ చేస్తున్నారట! ఈ నెల 23న కిరణ్.
జగన్ పార్టీ కండువాను కప్పుకోనున్నట్టు తెలుస్తోంది.ఇదే నిజమైతే.
కిరణ్ పొలిటికల్ ఎంట్రీ పెద్ద ఎత్తున సంచలనం కానుంది.
వాస్తవానికి కిరణ్ కుమార్ రెడ్డి కన్నా పొలిటికల్‌గా జూనియర్ అయిన జగన్.
సీఎం సీటుపై కన్నేసిన విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే ఆయన కాంగ్రెస్ అధిష్టానాన్ని ఢీ అంటే ఢీ అని ఎదిరించారు.
నేరుగా సోనియాగాంధీపైనే విమర్శలు సంధించి పెద్ద ఎత్తున తన సాక్షిమీడియాలో కథనాలు ప్రసారం చేశారు.ఈ క్రమంలోనే కిరణ్‌కుమార్ పెద్ద ఎత్తున జగన్‌పై విరుచుకుపడ్డారు.
ముఖ్యంగా అసెంబ్లీ వేదికగా కూడా సాక్షి కథనాలపై ఆయన విమర్శలు గుప్పించారు.సాక్షి మాస్ట్ హెడ్ బ్యాక్ గ్రౌండ్ కలర్‌పైనా కిరణ్ కుమార్ విరుచుకుపడ్డారు.
ఎల్లో కలర్ లో సాక్షి పేరు ఉంటుందని, దీనిని వైఎస్ ఎంతో వ్యతిరేకించారని, అయినా కూడా జగన్ తన మంకు పట్టుతో దానినే ఉంచారని, దీనిని బట్టి ఆయన ఎజెండా ఏమిటో తెలుస్తోందని విరుచుకుపడ్డారు.అలాంటి కిరణ్ ఇప్పుడు అదే జగన్ చెంతకు చేరడం విచిత్రం.
వాస్తవానికి సమైక్యాంధ్రకు జై కొట్టిన కిరణ్.రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకించారు.
ఈ క్రమంలోనే ఆయన సోనియాకు పలు నివేదికలు కూడా ఇచ్చారు.అయినా కూడా ఆమె కిరణ్ నివేదికలను పక్కన పెట్టి.
తెలంగాణ ఇచ్చేశారు.ఇక, ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్‌కు బై చెప్పేశారు.
ఆ తర్వాత 2014 ఎన్నికల్లో తాను ప్రత్యేకంగా జై సమైక్యాంధ్ర పార్టీని స్థాపించారు.అయితే, తాను పోటీకి దిగకుండా కొందరు తన అనుచరులను ఎన్నికల బరిలో దింపారు.
అయితే, ఏ ఒక్కరూ విజయం సాధించలేదు.దీంతో ఆపార్టీ తెరమరుగైంది.
ఇక, అప్పటి నుంచి ఖాళీగా ఉంటున్న కిరణ్.తాజాగా 2019 ఎన్నికలపై దృష్టి పెట్టారు.
ఎట్టి పరిస్థితిలో ఆ ఎన్నికల్లో పాల్గొనాలని ఆయన ప్లాన్ చేశారు.ఈ క్రమంలోనే ఆయన కాంగ్రెస్ మినహా టీడీపీ లేదా బీజేపీ వంటి పార్టీల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
అయితే, ఆయా పార్టీల నుంచి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ లేకపోవడంతో ఇప్పుడు వైకాపాలోకి జంప్ చేస్తున్నారు.ఇక్కడ కిరణ్‌కి రెండు రకాల ప్రయోజనం ఉంది.
ఒకటి ఆయన సీనియార్టీని జగన్ వినియోగించుకోవడం, రెండు 2019లో ఈ పార్టీ అధికారంలోకి వస్తే.ఆశించిన పదవిని పొందే అవకాశం ఉంటుంది.
మరోపక్క వైకాపాకు కూడా కిరణ్ వంటి సీనియర్ నేతలు ఇప్పడు అత్యవసరం.ముఖ్యంగా అవినీతి ఆరోపణలు లేని నేతగా కిరణ్ పేరు తెచ్చుకున్నారు.
దీంతో ఇలాంటి నేతలను వినియోగించుకోవాలని జగన్ భావిస్తున్నారు.సో.ఇరు పక్షాలకూ కెమిస్ట్రీ బాగుండడంతో కిరణ్ సెకండ్ ఇన్నింగ్స్‌కి అన్నీ సిద్ధమయ్యాయన్నమాట!
.