ప్రపంచ దేశాల్లో కెల్లా భారతదేశంలో గురువుకి( Teacher ) అత్యంత గౌరవం ఇస్తారు.భారత సంస్కృతి తల్లిదండ్రులకు సమానం అన్న రీతిలో.
గురువు పట్ల ఉంటుంది.సమాజంలో ఉపాధ్యాయ వృత్తికి అత్యంత గౌరవం ఉంది.
గురువు విద్యార్థులకు అందించే విద్యా విజ్ఞానం బట్టి సమాజం ఉంటుందని చాలా మంది అంటారు.ఒక విధంగా చెప్పాలంటే దేశ భవిష్యత్తుకు పునాదులు వేసేది గురువే అని చెబుతుంటారు.
అందుకే గురువులను ప్రత్యక్ష దైవంగా కొలుస్తారు.సెప్టెంబర్ 5వ తారీఖు ఉపాధ్యాయ దినోత్సవ వేడుకను( Teachers Day ) దేశవ్యాప్తంగా చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు.
దేశానికి రెండో రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్.( Sarvepalli Radhakrishnan ) దేశానికి అందించిన సేవలను గుర్తు చేసుకుంటారు.
అయితే ఈ వేడుక సందర్భంగా ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్( Minister Adimulapu Suresh ) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి.గూగుల్( Google ) వచ్చాక గురువులు లేకున్నా ఏం కాదు అంటూ.గురువులను తక్కువ చేసే రీతిలో వ్యాఖ్యలు చేయడం జరిగింది.ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగిన గురుపూజోత్సవం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆదిమూలపు సురేష్… ప్రస్తుత కాలంలో గురువులకు తెలియనివి కూడా గూగుల్ లో కొడితే తెలిసిపోతుందంటూ వ్యాఖ్యలు చేశారు.
దీంతో ఆదిమూలపు సురేష్ చేసిన వ్యాఖ్యలపై టీచర్స్ మండిపడుతున్నారు.ఉపాధ్యాయులను అవమానపరిచేలా వ్యాఖ్యలు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.