భారత సంతతి సిక్కు మహిళ, బ్రిటీష్ ఆర్మీ అధికారి ప్రీత్ చాంద్ చరిత్ర సృష్టించారు.దక్షిణ ధృవానికి సోలోగా యాత్రను పూర్తి చేసిన తొలి శ్వేతజాతీయేతర మహిళగా రికార్డుల్లో కెక్కారు.
గత కొన్ని నెలలుగా అంటార్కిటికాలో ఒంటరిగా స్కీయింగ్ చేస్తూ వచ్చిన చాందీ జనవరి 3న 700 మైళ్ల ట్రెక్‌ను 40 రోజుల్లో పూర్తి చేసింది.ఈ అనుభూతి కొత్తగా వుందని చాందీ తన బ్లాగ్ ద్వారా తెలిపారు.తన విజయాన్ని తాత గారికి అంకితమిస్తున్నట్లు ప్రకటించింది.ఈ యాత్ర సమయంలో చాందీ తన బ్లాగ్, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఎప్పటికప్పుడు అప్‌డేట్‌లు ఇస్తూ బయటి ప్రపంచంతో టచ్‌లో వున్నారు.
ప్రీత్ చాంద్ తన యాత్రను గతేడాది నవంబర్ 7న ప్రారంభించారు.చిలీలోని అంటార్కిటికా హెర్క్యులస్ నుంచి ఆమె బయల్దేరారు.
32 ఏళ్ల హర్‌ప్రీత్ చాందీ బ్రిటీష్ సైన్యంలో కెప్టెన్‌గా పనిచేస్తున్నారు.దక్షిణ ధృవాన్ని ఎవరి సాయం లేకుండా ఒంటరిగా చుట్టి రావాలని.
తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారత సంతతి మహిళగా నిలవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.దక్షిణ ధృవంపై మైనస్ 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో పాటు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుంటాయి.
ఇలాంటి ప్రతికూల పరిస్ధితుల్లో తన కిట్‌ను లాక్కుంటూ 700 మైళ్లు వెళ్లారు.ఈ మేరకు తన బ్లాగ్‌లో చాందీ వ్రాసుకొచ్చారు.

ప్రస్తుతం హర్‌ప్రీత్ ఇంగ్లాండ్ వాయువ్య ప్రాంతంలో ఉన్న మెడికల్ రెజిమెంట్‌లో సైన్యంలోని వైద్యులకు క్లినికల్ ట్రైనింగ్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.ఆమె లండన్‌లోని క్వీన్ మేరీస్ యూనివర్సిటీలో పార్ట్‌టైమ్‌లో స్పోర్ట్స్ అండ్ ఎక్సర్‌సైజ్ మెడిసిన్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు.అంటార్కిటికా భూమిపై అత్యంత శీతలమైన, ఎత్తైన, పొడిగా, గాలులతో వుండే ఖండమని ఆమె చెప్పారు.అక్కడ శాశ్వతంగా ఎవరూ నివసించరని.తొలుత తన ప్రణాళికను ప్రారంభించినప్పుడు ఆ ఖండం గురించి పెద్దగా ఏమి తెలియదని అదే తనను అక్కడికి వెళ్లడానికి ప్రేరేపించిందని హర్‌ప్రీత్ తెలిపారు.ఈ ఖండంలో ఒంటరిగా, ఎవరి మద్ధతు లేకుండా ట్రెక్‌ను పూర్తి చేసిన సాహస మహిళలు కొందరే వున్నారని .అందువల్ల కొత్త చరిత్ర సృష్టించాల్సిన సమయం ఇది అని ఆమె చిలీకి బయల్దేరుతూ సీఎన్ఎన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు.