సమాజంలో రోజురోజుకు మహిళలపై వేధింపులు, అత్యాచార ఘటనలు పెరుగుతున్న సంగతి తెలిసిందే.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చట్టాలను అమలు చేస్తున్నప్పటికీ పరిస్థితుల్లో మార్పు రావడం లేదు.
ఇతర ఇండస్ట్రీలతో పోలిస్తే సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటాయి.చాలామంది హీరోయిన్లు, నటీమణులు ఇప్పటికే క్యాస్టింగ్ కౌచ్ ఘటనల గురించి ఓపెన్ కావడంతో పాటు మీటూ ఉద్యమాన్ని సోషల్ మీడియాలో ప్రారంభించారు.
అయితే ఈ ఉద్యమం గురించి సీనియర్ నటుడు, శక్తిమాన్ ఫేమ్ ముఖేష్ ఖన్నా మాట్లాడుతూ మహిళలే మీటూ ఉద్యమానికి బాధ్యులంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు.మహిళల బాధ్యత ఇంటి పని చేసుకోవడమే అని.కానీ మహిళలు ఇంటి పనిని వదిలేసి పురుషులతో పోటీ పడుతున్నారని.మీటూ ఉద్యమానికి కూడా మహిళలే బాధ్యత వహించాలని పేర్కొన్నారు.
ముఖేష్ ఖన్నా చేసిన వ్యాఖ్యలపై నటీమణులు, నెటిజన్లు మండిపడుతున్నారు.
ముఖేష్ ఖన్నా వ్యాఖ్యల గురించి సింగర్ చిన్మయి స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తనకు కొందరి మానసిక పరిస్థితిని చూస్తుంటే ఇబ్బందిగా ఉందని ఆమె పేర్కొన్నారు.పాత ధోరణిలో వాస్తవాలు తెలుసుకోకుండా కొందరు వ్యాఖ్యలు చేస్తుంటారని.
ఒకతను మహిళలు ఉద్యోగాలు చేయడం వల్లే మీటూ ఉద్యమం ప్రారంభమైందని వ్యాఖ్యలు చేశారని.అలా చెప్పిన వ్యక్తి పురుషుల హింసాత్మకమైన కోరికలను కంట్రోల్ చేసుకోవాలని ఎందుకు చెప్పలేకపోయారంటూ ప్రశ్నించారు.
మరో సీనియర్ నటి రాధికా శరత్ కుమార్ ముఖేష్ ఖన్నా వ్యాఖ్యల గురించి స్పందిస్తూ కొందరి మూర్ఖత్వపు మాటలను వింటుంటే తనకు భయం కలుగుతోందని అన్నారు.అలాంటి మూర్ఖపు మాటలకు వీలైనంత దూరంగా ఉంటే మంచిదని పేర్కొన్నారు.
ముఖేశ్ ఖన్నా వ్యాఖ్యలపై నెటిజన్లు సైతం తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.ఆయన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని.
మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు క్షమాపణ కోరాలని కామెంట్లు చేస్తున్నారు.