చిరంజీవి, ఎన్టీఆర్.తెలుగు సినిమా పరిశ్రమలో ఇద్దరు ఇద్దరే.
ఆ తరం నటుల్లో చిరంజీవి మేటి నటుడు అయితే.ఈ తరం నటుల్లో ఎన్టీఆర్ చిచ్చర పిడుడు.
స్టూడెంట్ నెంబర్ వన్, ఆది సినిమాల్లో నటించి.తాతకు మించిన మనువడు అనిపించుకున్నాడు.
జూలై 2002లో బి గోపాల్ దర్శకత్వంలో అల్లరి రాముడు సినిమా చేస్తున్నారు.రిలీజ్ డేట్ జూల్ 18.అటు చిరంజీవికి సంబంధించి మృగరాజు, మంజునాథ సినిమాలు ఘోర పరాభవాన్ని అందుకున్నాయి.డాడీ మూవీ కూడా అనుకున్నంత స్థాయిలో విజయం సాధించలేదు.
ఎలాగైనా హిట్ కొట్టాలని ఇంద్ర సినిమా చేశాడు.ఈ సినిమా రిలీజ్ జూలై 24గా ఫిక్స్ చేశారు.
మొత్తంగా అల్లరి రాముడు, ఇంద్ర సినిమాలకు మధ్య కేవలం వారం రోజుల వ్యవధి కూడా లేదు.రెండు సినిమాలకు ఓకే దర్శకుకుడు కూడా.రెండు సినిమాల్లోనూ హీరోయిన్ ఆర్తీ అగర్వాల్.ఎన్టీఆర్ వరుస విజయాలతో ఉండగా.
ఈ సినిమా విడుదల అవుతుంది.ఇక ఇంద్ర సినిమాకు కూడా మంచి హైప్ వచ్చింది.
చిరంజీవి ఫ్యాక్షన్ సినిమా చేయడం.దానికి అశ్వనీదత్ నిర్మాతగా ఉండటంతో ఈ సినిమాకు ఓ రేంజిలో హైప్ వచ్చింది.
ఒకే సమయంలో రెండు భారీ సినిమాలు రిలీజ్ అవుతుండటంతో సినిమా అభిమానుల్లో మస్తు సందడి నెలకొంది.
నందమూరి, మెగా అభిమానుల్లో ఉత్కంఠ పెరిగింది.ఎవరి సినిమా మంచి హిట్ కొడుతుందోనని అందరూ ఎదురు చూశారు.మొత్తంగా ఇంద్ర సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది.
ఇండస్ట్రీ రికార్డులు కొల్లగొట్టింది.అటు అల్లరి రాముడు సినిమా అనుకున్నంత స్థాయిలో కాకపోయినా.
మంచిగానే నడిచింది.
పెట్టిన పెట్టుబడితో పోల్చితే రెట్టింపు లాభాలు వచ్చాయి.ఈ విషయాన్ని ఆ సినిమా నిర్మాత చంటి అడ్డాల ఎన్నోసార్లు వెల్లడించాడు.అప్పట్లో చిరు వర్సెస్ ఎన్టీఆర్.
సినిమాలో ఇండస్ట్రీలో బాగా ఉత్కంఠ రేపాయి.మొత్తంగా ఇద్దరి సినిమాలు మంచి ఫలితాలనే ఇచ్చాయి.