2021లో కోవిడ్-19 టెస్ట్ లో పాజిటివ్ అని తేలిన తర్వాత తన సహోద్యోగుల వద్ద ఉద్దేశపూర్వకంగా దగ్గినందుకు సింగపూర్( Singapore ) లో నివసిస్తున్న భారతీయుడికి రెండు వారాల జైలు శిక్ష విధించడం జరిగింది.తమిళసెల్వం రామయ్య( Tamilselvam Ramaiah ) అనే 64 ఏళ్ల వ్యక్తి ఆ సమయంలో క్లీనర్‌గా పనిచేస్తున్నాడు.
పరీక్షలో పాజిటివ్ వచ్చిన తర్వాత ఇంటికి వెళ్లమని అతనికి పైవారు తెలిపారు, కానీ అతను బదులుగా తన సహోద్యోగులకు పరీక్ష ఫలితం గురించి తెలియజేయడానికి కంపెనీ లాజిస్టిక్స్ ఆఫీస్‌కు వెళ్లాడు.
అక్కడ ఉన్నప్పుడు, అతను తన ఇద్దరు సహోద్యోగుల ముందు దగ్గాడు, వారిలో ఒకరు గుండె, మూత్రపిండాల సమస్యలతో బాధపడుతున్న డయాలసిస్ రోగి.
అతను కిటికీ తెరిచి, గాజుకు అవతలి వైపు ఉన్న మూడవ సహోద్యోగి వద్ద దగ్గాడు.దాంతో కంపెనీ అసిస్టెంట్ లాజిస్టిక్స్ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.రామయ్య తన కొలీగ్స్ వద్ద ఏదో జోక్ గా దగ్గానని విచారణాధికారులతో చెప్పాడు.అయితే, ఇది నవ్వే విషయం కాదని, ఆ చర్యలు అతని సహచరులకు కోవిడ్ -19 బారిన పడే ప్రమాదం పెంచుతాయని ప్రాసిక్యూషన్ పేర్కొంది.

కోవిడ్-19 నిబంధనను( Covid-19 Regulation ) ఉల్లంఘించినందుకు రామయ్యకు రెండు వారాల జైలు శిక్ష విధించబడింది.అతనికి ఆరు నెలల వరకు జైలు శిక్ష, 10,000 సింగపూర్ డాలర్ల (రూ.ఆరు లక్షల పై మాటే) వరకు జరిమానా లేదా రెండూ కూడా విధించే అవకాశం ఉంది.రామయ్య చర్యలు బాధ్యతారాహిత్యంగా, నిర్లక్ష్యపూరితంగా ఉన్నాయని ఈ కేసులో న్యాయమూర్తి అన్నారు.
మరికొందరు ఇలాంటి నేరాలకు పాల్పడకుండా ఉండాలంటే ఈ శిక్ష తప్పదని స్పష్టం చేశారు.

తమిళసెల్వం రామయ్య కేసు కోవిడ్-19 నిబంధనలను సీరియస్‌గా తీసుకోవాల్సిన ప్రాముఖ్యతను గుర్తుచేస్తుంది.ఇతరుల వద్ద ఉద్దేశపూర్వకంగా దగ్గడం, ముఖ్యంగా వైరస్ బారిన పడే అవకాశం ఉన్నవారి ముందు దగ్గడం, తీవ్రమైన నేరం, ఇది తీవ్రమైన అనారోగ్యం లేదా మరణానికి కూడా దారి తీసే అవకాశం ఉంది.







