Chiranjeevi Chota K Naidu: చిరంజీవిపై ప్రశంసలు కురిపించిన చోటా కె నాయుడు.. చేయితడి ఆరకముందే వచ్చేవారంటూ?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

 Cinematographer Chota K Naidu Great Words About Megastar Chiranjeevi-TeluguStop.com

సినిమా హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు.ఇది ఇలా ఉంటే మెగాస్టార్ చిరంజీవితో కలిసి పని చేసిన ప్రతి ఒక్కరూ కూడా ఆయన వ్యక్తిత్వం గురించి ఆయన గొప్పతనం గురించి చెబుతూనే ఉంటారు.

తాజాగా ఆయన గురించి మాట్లాడుతూ పొగడ్తల వర్షం కురిపించారు చోటా కె నాయుడు.( Chota K Naidu )

Telugu Chota, Chiranjeevi, Tollywood-Movie

ఈ సందర్భంగా ఆయన చిరంజీవి గురించి మాట్లాడుతూ.గాఢ్ పాదర్ సినిమాలో ఒక పాట చేశాను.బాబీ సినిమాలో ఆయన ఇంట్రడక్షన్ సీన్ కోసం కొన్ని రోజులు పనిచేశాను.

వాల్తేరు వీరయ్య( Waltair Veerayya ) సినిమాకు డబుల్ యూనిట్ పెట్టారు.దీంతో ఒరిజినల్ కెమెరామేన్ ఒక యూనిట్‌లో చేస్తే నేను ఇంకో యూనిట్‌లో చేశాను.

రిలీజ్ డేట్ దగ్గర పడడంతో నేను కూడా పనిచేశాను.చిరంజీవి గారు పిలవడంతో వెళ్లాను.

ఆయనతో పనిచేస్తుంటే ఒక కిక్ ఉంటుంది అని చోటా కె నాయుడు తెలిపారు.వాల్తేరు వీరయ్య విడుదల తేదీ దగ్గర పడిపోతుండడంతో అంతా హడావుడి అయిపోయిందని ఆ సమయంలో చిరంజీవి రోజుకి 18 నుంచి 20 గంటల పాటు పనిచేశారని చోటా వెల్లడించారు.

Telugu Chota, Chiranjeevi, Tollywood-Movie

అల్యూమినియం ఫ్యాక్టరీలో ఆయన సాంగ్ చేసి అక్కడ గంటన్నరకు అన్నం తిని చెయ్యి కూడా తడి ఆరకుండా బయలుదేరి 2 గంటలకు శంషాబాద్ వచ్చేసి సముద్రం సీన్‌లో యాక్ట్ చేశారు.రాత్రి 11 గంటల వరకు షూటింగ్ చేసేవారు.మళ్లీ ఉదయాన్నే అల్యూమినియం ఫ్యాక్టరీలో పాట షూటింగ్ చేసేవారు.అంత కష్టపడ్డారు అని చెప్పుకొచ్చారు చోటా కె నాయుడు.ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి సినిమాల విషయానికొస్తే చిరంజీవి ఇటీవలె భోళా శంకర్( Bhola Shankar ) సినిమాతో ప్రేక్షకులను పలకరించగా ఈ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ గా నిలిచింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube