వయసు పెరిగే కొద్దీ యవ్వనమైన మెరిసే చర్మాన్ని కోల్పోతుంటారు.ఈ విషయాన్ని చాలా మంది జీర్ణించుకోలేరు.
ఈ క్రమంలోనే వయసు పైబడిన యవ్వనంగా మెరిసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా? అయితే మీకు ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ సీరం అద్భుతంగా సహాయపడుతుంది.ఈ సీరం ను రెగ్యులర్ గా వాడితే వయసు పైబడిన యవ్వనంగా మెరుస్తారు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ సీరంను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు బియ్యం వేసి వాటర్ తో ఒకసారి వాష్ చేసుకోవాలి.ఆ తర్వాత ఒక కప్పు కొబ్బరి పాలు( Coconut Milk ) వేసి బాగా కలిపి నైట్ అంతా నానబెట్టుకోవాలి.మరుసటి రోజు మిక్సీ జార్ లో నానబెట్టుకున్న రైస్ ను కొబ్బరి పాలతో సహా వేసుకుని స్మూత్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్ట్రైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.
ఈ జ్యూస్ లో వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్, నాలుగు చుక్కలు టర్మరిక్ ఎసెన్షియల్ ఆయిల్, హాఫ్ టేబుల్ స్పూన్ స్వీట్ ఆల్మండ్ ఆయిల్( Almond Oil ), హాఫ్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ వేసుకుని కనీసం ఐదు నిమిషాల పాటు బాగా మిక్స్ చేయాలి.తద్వారా మన సీరం సిద్ధం అవుతుంది.ఈ సీరంను ఒక బాటిల్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.రోజు నైట్ నిద్రించేముందు ఈ సీరం ను ముఖానికి మరియు మెడకు అప్లై చేసుకొని కనీసం ఐదు నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి.
ఇలా రెగ్యులర్ గా ఈ సీరంను వాడితే ముడతలు, చర్మం సాగటం తదితర వృద్ధాప్య లక్షణాలు త్వరగా దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.చర్మం బిగుతుగా మారుతుంది.వయసు పెరిగిన సరే యవ్వనంగా మెరుస్తారు.కాబట్టి యవ్వనమైన మెరిసే చర్మాన్ని పొందాలని కోరుకునే వారు తప్పకుండా ఈ హోమ్ మేడ్ సీరం ను తయారు చేసుకుని వాడేందుకు ప్రయత్నించండి.