షాంపూలో ఇవి కలిపి హెయిర్ వాష్ చేసుకుంటే ఆరోగ్యమైన మెరిసేటి కురులు మీ సొంతం!

జుట్టు సంరక్షణలో హెయిర్ వాష్ ( Hair wash )అనేది తప్పనిసరి.కొందరు రెగ్యులర్ గా హెయిర్ వాష్ చేసుకుంటే మరికొందరు వారానికి ఒకసారి లేదా రెండుసార్లు చేసుకుంటారు.

 Mix These In Your Shampoo And Wash Your Hair For Healthy And Shiny! Shampoo, Sha-TeluguStop.com

వారానికి రెండు సార్లు హెయిర్ వాష్ చేసుకోవడం అనేది సరైన పద్ధతి‌.అయితే నేరుగా కాకుండా షాంపూ లో ఇప్పుడు చెప్పబోయే పదార్థాలను కలిపి హెయిర్ వాష్ చేసుకుంటే ఆరోగ్యమైన మెరిసేటి కురులు మీ సొంతం అవుతాయి.

జుట్టు రాలడం కూడా తగ్గుతుంది.

అందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు మెంతులు ( fenugreek )మరియు ఒక గ్లాస్ వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.

మరుసటి రోజు నానబెట్టుకున్న మెంతులను 10 నుంచి 12 నిమిషాల పాటు మరిగించి వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్( Coffee powder ), వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్( Coconut oil ) మరియు రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు రెగ్యులర్ షాంపూ వేసుకొని మిక్స్ చేయాలి.

Telugu Care, Care Tips, Healthy, Mixshampoo, Shampoo Hack, Shiny, Simple Remedy-

చివరిగా మెంతుల వాటర్ ని కూడా అందులో పోసి బాగా కలపాలి.ఇప్పుడు ఈ వాటర్ ను ఉపయోగించి తల స్నానం చేయాలి.వారానికి రెండు సార్లు ఈ విధంగా హెయిర్ వాష్ చేసుకుంటే సూపర్ బెనిఫిట్స్ మీ సొంతం అవుతాయి.మెంతులు, కాఫీ పౌడర్ మరియు కొబ్బరి నూనె ఇవి మూడు జుట్టు ఆరోగ్యానికి అండగా ఉంటాయి.

జుట్టు రాలడాన్ని అరికడతాయి.కురులను బలోపేతం చేస్తాయి.

Telugu Care, Care Tips, Healthy, Mixshampoo, Shampoo Hack, Shiny, Simple Remedy-

చుండ్రు, తలలో విపరీతమైన దురద వంటి సమస్యలను అరికడతాయి.కాఫీ పౌడర్ తెల్ల జుట్టు త్వరగా రాకుండా అడ్డుకుంటుంది.కొబ్బరి నూనె జుట్టుకు తేమను అందిస్తుంది.మెంతులు జుట్టు రాలడాన్ని అరికట్టి ఎదుగుదలను ప్రోత్సహిస్తాయి.కురులను షైనీ గా మెరిపిస్తాయి.కాబట్టి ఆరోగ్యమైన మెరిసే కురులను కోరుకునేవారు మరియు జుట్టు రాలడాన్ని అడ్డుకోవాల‌ని భావించేవారు తప్పకుండా ఇప్పుడు చెప్పుకున్న సింపుల్ షాంపూ హ్యాక్ ను ప్రయత్నించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube