ఒక పనిని కొన్ని సంవత్సరాలుగా చేస్తూ ఉంటే అందులో చాలా నైపుణ్యం వస్తుంది.ఆ పనిలో రకరకాల టెక్నిక్స్ కూడా తెలుస్తాయి.
ఇవన్నీ కామనే! అయితే కొందరు మాత్రం ఊహలకు అతీతంగా చాలా ఫాస్ట్ గా పనిచేస్తూ అబ్బురపరుస్తుంటారు.ఇలాంటి వర్కర్స్ కి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో అప్పుడప్పుడు వైరల్ అవుతుంటాయి.
తాజాగా ఆ కోవకి చెందిన మరొక వీడియో వైరల్ గా మారింది.
ఒక మహిళ తన అద్భుతమైన ప్యాకింగ్( Packing ) నైపుణ్యాలతో ఆన్లైన్లో చాలా మందిని ఆకట్టుకుంది.
ఆమె పెద్ద సైకిళ్లను( Cycles ) కొన్ని సెకన్లలో ప్లాస్టిక్ సంచుల్లో ప్యాక్ చేయగలుగుతోంది.ఆమె ఇలా చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఈ వీడియోను ‘సైన్స్ గర్ల్’ అనే X (గతంలో ట్విట్టర్) యూజర్ షేర్ చేశారు.వీడియో కేవలం ఎనిమిది సెకన్ల నిడివితో ఉంది, అయితే మహిళ సైకిళ్లను త్వరగా, సులభంగా ఎలా ప్యాక్ చేయవచ్చో వీడియోలో కనిపించింది.

ఆమె ప్లాస్టిక్ సంచులలో చుట్టుపక్కల నుంచి గాలిని నింపి,( Air ) ఆపై వాటిని సైకిళ్ల వైపుకు నెట్టివేసింది.గాలి నింపిన బ్యాగ్‌లు సైకిళ్లను కవర్ చేసి, అతుక్కుపోయాయి.చాలా మంది ఈ వీడియోను చూసి వావ్ అని కామెంట్స్ చేస్తున్నారు.మహిళ ( Woman ) దీన్ని ఎలా చేయగలుగుతుందో అర్థం కావడం లేదని మరికొందరు కామెంట్లు చేశారు.
ఆమె నైపుణ్యం, వేగం చూసి వారు ఆశ్చర్యపోతున్నారు కూడా.

ఈ మహిళ న్యూటన్ మూడవ చలన నియమాన్ని ఉపయోగిస్తుందని ఒక వ్యక్తి ఫన్నీగా కామెంట్ చేశాడు.మహిళ బ్యాగ్ చివరను సైకిల్ చక్రానికి వ్యతిరేకంగా నొక్కి, బ్యాగ్ లోపల గాలిని బిగుతుగా నింపుతోందని వ్యక్తి వివరించాడు.ఆపై ఆమె బ్యాగ్ మరొక చివరను వదులుతుంది, దాంతో గాలి వేగంగా బయటకు వస్తూ బ్యాగ్ ముందుకు కదులుతూ సైకిల్‌ను కవర్ చేస్తుందని పేర్కొన్నాడు.
మరొక వ్యక్తి మహిళ స్టాటిక్ విద్యుత్తును ఉపయోగిస్తుందని అభిప్రాయపడ్డాడు.ఓ వ్యక్తి జోక్ చేస్తూ ఆ మహిళ ఫిజిక్స్ టాపర్ అని చెప్పాడు.







