చూసేందుకు అందవిహీనంగా కనిపించే ఆ నల్ల మచ్చలు.ముఖ సౌందర్యాన్ని తీవ్రంగా దెబ్బ తీస్తాయి.
అందుకే వాటిని నివారించుకునేందుకు రకరకాల క్రీములు, సీరమ్‌లు యూజ్ చేస్తుంటారు.అయినప్పటికీ ఫలితం లేకుండా ఆ మచ్చలను పోగొట్టుకునేందుకు రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు.
అయితే ఇప్పుడు చెప్పబోయే వాటర్‌తో ప్రతి రోజు ఫేస్‌ను వాష్ చేసుకుంటే.కొద్ది రోజుల్లోనే ముఖంపై ఏర్పడిన నల్ల మచ్చలన్నీ పరార్ అవుతాయి.
మరి ఇంకెందుకు లేట్.ఆ వాటర్ ఏంటో.
? ఎలా తయారు చేసుకోవాలి.? తెలుసుకుందాం పదండీ.
ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో మూడు గ్లాసుల వాటర్ పోసి హీట్ చేసుకోవాలి.
వాటర్ వేడి అయిన తర్వాత.గుప్పెడు వేపాకులను, గుప్పెడు తులసి ఆకులను లైట్‌గా దంచి వేయాలి.
వాటర్ కలర్ మారే వరకు బాగా మరిగిచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.ఇప్పుడు గోరు వెచ్చగా అయ్యాక వాటర్‌ను ఫిల్టర్ చేసుకుని అందులో రెండు స్పూన్ల రోజ్ వాటర్, ఒక స్పూన్ గ్లిజరిన్ యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి.
"""/" /
ఇక ఈ వాటర్‌ను యూజ్ చేసి ఉదయాన్నే ఫేస్ వాష్ చేసుకోవాలి.
ఇలా ప్రతి రోజు చేస్తే గనుక.వేప మరియు తులసి ఆకుల్లో ఉండే పలు ముఖ్యమైన పోషకాలు చర్మంపై ఏర్పడిన మొటిమలను క్రమంగా మాయం చేస్తాయి.
అలాగే ఈ వాటర్‌తో రెగ్యులర్‌గా ముఖాన్ని శభ్ర పరుచుకుంటే.చర్మంపై ముడతలు, సన్ని గీతలు పడకుండా ఉంటాయి.
మొటిమలు సమస్య తగ్గు ముఖం పడుతుంది.ముఖ చర్మం నిగారింపుగా మెరిసి పోతుంది.
మరియు కళ్ల మంటలు, దురదలు, అలసట, ఎర్ర బారడం వంటి సమస్యలు సైతం దూరం అవుతాయి.
కాబట్టి, నల్ల మచ్చలు ఉన్న వారే కాదు.ఎవ్వరైనా ఈ వాటర్‌తో ఫేస్ వాష్ చేసుకోవచ్చు.