మహేష్ బాబుని చూడగానే ఆ విషయం గురించి అడిగా.. మేజర్ హీరోయిన్ కామెంట్స్ వైరల్!

మెగా హీరో వరుణ్ తేజ్ సరసన గని సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ సాయి మంజ్రేకర్ గురించి అందరికీ తెలిసిందే.

తాజాగా ఈ బ్యూటీ మేజర్ సినిమా ద్వారా మరోసారి పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమయ్యారు.

ఈ సినిమా మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న విషయం మనకు తెలిసిందే.ఇక ఇందులో మేజర్ సందీప్ పాత్రలో హీరో అడివి శేష్ నటిస్తున్నారు.

ఈ సినిమాని మహేష్ బాబు,ఏ ప్లస్‌ ఎస్‌ మూవీస్‌, సోనీ పిక్చర్స్‌ ఫిల్మ్స్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం మనకు తెలిసిందే ఇకపోతే తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేశారు.ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా మహేష్ బాబు పాల్గొని ఆయన చేతుల మీదుగా విడుదల చేశారు.

ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా హీరో అడివి శేష్ హీరోయిన్ సాయి మంజ్రేకర్ ఆలీతో సరదాగా సరదాగా కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement

ఈ సందర్భంగా అలీ హీరోయిన్ తో మాట్లాడుతూ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కార్యక్రమంలో మహేష్ బాబుని కలిసారా అని ప్రశ్నించారు? ఈ ప్రశ్నకు ఆమె సమాధానం చెబుతూ మొదటిసారి మహేష్ బాబును కలిసానని సమాధానం చెప్పారు.ఆయనను చూడగానే తన తదుపరి సినిమాలో ఛాన్స్ ఇవ్వమని అడిగారా? అంటూ ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు సాయి మంజ్రేకర్ సమాధానం చెబుతూ తన సినిమాలో అవకాశం కల్పించమని అడగలేదు కానీ తన అందం వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి అనే విషయాన్ని అడిగానని ఈమె తెలిపారు.

ఈ విధంగా సాయి మంజ్రేకర్ మహేష్ బాబు గురించి చేసిన ఓపెన్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Advertisement

తాజా వార్తలు