ప్రస్తుత కాలంలో సినిమాలన్నీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవాలి అంటే సినిమాలలో కాస్త మసాలా యాడ్ చేయాల్సిన అవసరం దర్శక నిర్మాతలకు ఉందనే చెప్పాలి.ఇలా సినిమాలలో రొమాంటిక్ సన్నివేశాలు పెట్టడం వల్లే ప్రేక్షకులు కూడా సినిమాలకు కనెక్ట్ అవుతున్నారనే విషయం తెలుసుకున్నటువంటి మేకర్స్ ప్రతి ఒక్క సినిమాలోను ఇలాంటి రొమాంటిక్ సన్నివేశాలను జోడించడం జరుగుతుంది.
ఒకప్పుడు ఇలాంటి సీన్స్ చేయడానికి హీరోయిన్స్ కూడా వెనుకడుగు వేసేవారు కానీ ప్రస్తుతం ఎలాంటి మొహమాటం లేకుండా లిప్ లాక్ సన్ని వేశాల్లో కూడా హీరోయిన్స్ నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.
నేషనల్ క్రష్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి రష్మిక మందన్న( Rashmika Mandanna ) ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస భాషా చిత్రాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈమె వరస అవకాశాలను అందుకుంటు అక్కడ కూడా సక్సెస్ అందుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.ఇదివరకే రెండు సినిమాలలో నటించిన పెద్దగా గుర్తింపు రాలేకపోయింది.
తాజాగా ఈమె సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో హీరో రణబీర్ కపూర్ (Ranbir Kapoor) తో కలిసి యానిమల్(Animal ) అనే సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ పాటలు కనుక చూస్తే ఈ సినిమాలో బోల్డ్ కంటెంట్ విపరీతంగా ఉందని స్పష్టంగా అర్థం అవుతుంది.
ముఖ్యంగా హీరో హీరోయిన్ల మధ్య లిప్ లాక్ సన్నివేశాలు అధికంగా ఉన్నాయని సందీప్ రెడ్డివంగా చెప్పగానే చెప్పేశారు.అయితే ముందుగా ఈ సినిమాలో నటించే అవకాశం రష్మికకు కాకుండా హీరోయిన్ సమంతకు వచ్చిందట.అయితే ఈ సినిమాలో ఇలాంటి రొమాంటిక్ సన్నివేశాలు ఉన్నాయని విషయం తెలిసినటువంటి సమంతా తాను ఈ సినిమాలో నటించడం కుదరదని ఇలాంటి సినిమా మరే హీరోయిన్ నటించిన బాగుంటుందేమో కానీ నేను నటిస్తే బాగుండదు అంటూ ఈ అవకాశాన్ని వదులుకున్నారట.సమంత ఈ సినిమా విషయంలో తీసుకున్న నిర్ణయం చాలా మంచి నిర్ణయమే అంటూ ఈ విషయం తెలిసినటువంటి అభిమానులు భావిస్తున్నారు.
సమంత నాగచైతన్య( Nagachaitanya )ను పెళ్లి చేసుకొని విడాకులు తీసుకొని విడిపోయారు.ఇలా విడాకులు తీసుకున్న ఈమె ఇలాంటి రొమాంటిక్ సన్ని వేశాలలో నటించడం వల్ల తనపై నెగటివ్ ప్రభావం అధికంగా పడుతుందన్న కారణంతోనే సమంత (Samantha) సినిమా అవకాశాన్ని వదులుకున్నారని తెలుస్తోంది.