చర్మం మిలమిల మెరవాలంటే కరివేపాకు పేస్ పాక్స్

ప్రతి ఒక్కరు ముఖం అందంగా మిలమిల కాంతివంతంగా ఉండాలని కోరుకుంటారు.అయితే చాలా మందికి అందంగా ఉండటానికి సాధ్యపడదు.

 Curry Leaves Face Packs-TeluguStop.com

ఎందుకంటే బిజీ షెడ్యూల్ కావచ్చు లేదా బ్యూటీ పార్లర్ కి వెళ్లే స్తొమత లేకపోవచ్చు.అటువంటి వారి కోసం ఈ రోజు కరివేపాకు పేస్ పాక్స్ గురించి తెలుసుకుందాం.

సాధారణంగా మనం కరివేపాకును వంటల్లో వేసుకుంటూ ఉంటాం.కరివేపాకులో ఉండే ఎ,సి విటమిన్లు చర్మం ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది.

ఇప్పుడు ఆ ప్యాక్ ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం.

కరివేపాకు ప్యాక్ కి కావలసిన పదార్ధాలు

కరివేపాకు పేస్ట్ – 1 టేబుల్ స్పూన్ శనగపిండి – అర టేబుల్ స్పూన్ పెరుగు లేదా పాలు – అర టేబుల్ స్పూన్

ఒక బౌల్ లో కరివేపాకు పేస్ట్,శనగపిండి,పాలు లేదా పెరుగు వేసి బాగా కలపాలి.ఈ పేస్ట్ ని ముఖానికి పట్టించి అరగంట తర్వాత సాధారణమైన నీటితో శుభ్రం చేసుకోవాలి.ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తూ ఉంటె మంచి ఫలితం కనపడుతుంది.

కరివేపాకు పేస్ట్ కి బదులు కరివేపాకు పొడి అయినా ఉపయోగించవచ్చు.

ఈ ప్యాక్ లో ఉపయోగించిన పాలు చర్మాన్ని మృదువుగా చేస్తాయి.శనగపిండి మంచి క్లినింగ్ ఏజెంట్ గా పనిచేసి చర్మానికి మృదుత్వాన్ని మరియు కాంతిని కలిగిస్తుంది.ఇక కరివేపాకులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ముఖం మీద ఎటువంటి ఇన్ ఫెక్షన్స్ రాకుండా చేస్తుంది.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube