ఆ చంద్రుడు అలా ఆలోచిస్తున్నాడు .. ఈ చంద్రుడు ఇలా ఆలోచిస్తున్నాడు

ముందస్తు ఎన్నికలపై ఆంధ్రా తెలంగాణల్లో అధికార పార్టీలు భిన్నంగా ఆలోచిస్తున్నాయి.ఒకరేమో ముందస్తు ఎన్నికలకు వెళితే గెలుపు గుర్రం ఎక్కడం ఖాయం అని భావిస్తుండగా .

మరొకరేమో ముందస్తుకు వెళితే మునగడం ఖాయం అని అసలు ముందస్తు అనే ఆలోచనే తమ పార్టీకి కలిసిరాలేదని చెప్తోంది.కేంద్రం జమిలి ఎన్నికలపేరుతో దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని చూసింది కానీ అది కార్యరూపం దాల్చే పరిస్థితి కనిపించకపోవడంతో తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్రము లో ముందస్తుగా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలనే పట్టుదలతో ఉన్నాడు.

కానీ ఆ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు వణికిపోతున్నాడు.

నిర్ణీత సమయంలోనే లోక్‌సభతో పాటు అసెంబ్లీకి ఎన్నికలు జరగాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారు.ఇలా ఇద్దరు ముఖ్యమంత్రులు భిన్నంగా ఆలోచించడానికి కొన్ని ప్రత్యేక కారణాలున్నాయి.ఎన్నికలు తన ప్రభుత్వ పనితీరు ఆధారంగానే జరగాలని కేసీఆర్‌ భావిస్తున్నారు.

Advertisement

లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీకి ఎన్నికలు జరిగితే జాతీయ అంశాలు ప్రభావం చూపుతాయని, అప్పుడు తన పార్టీకి నష్టం తప్ప లాభం ఉండదని కేసీఆర్ భావిస్తున్నారు.ముఖ్యంగా హైదరాబాద్‌లోని ముస్లింలు జాతీయస్థాయిలో బీజేపీ కాంగ్రెస్‌లను పోటీదారులుగా భావించి కాంగ్రెస్‌కు ఓటేసే అవకాశం ఉంటుందన్నది కేసీఆర్ ఆలోచన.

దాని వల్ల ఒకేసారి ఎన్నికలు జరిగితే మైనార్టీలు లోక్‌సభతో పాటు.పనిలోపనిగా అసెంబ్లీకి కూడా కాంగ్రెస్‌కు ఓటేసే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.అదే అసెంబ్లీకి ప్రత్యేకంగా ఎన్నికలు నిర్వహిస్తే.

తెలంగాణలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం అనిపించే పరిస్థితుల్లో కాంగ్రెస్‌ గానీ, మరే పార్టీగాని లేదన్నది కేసీఆర్‌ అభిప్రాయంగా పార్టీ నేతలు చెబుతున్నారు.పైగా వ్యక్తిగత ఇమేజ్‌ పరంగానూ కేసీఆర్‌కు పోటీ ఇచ్చే వారు కాంగ్రెస్‌లో లేకపోవడాన్ని కూడా టీఆర్‌ఎస్ గుర్తు చేస్తోంది.

అందుకే అసెంబ్లీకి ముందస్తుగా ప్రత్యేకంగా ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుందని కేసీఆర్ ఆలోచన చేస్తున్నారు.దీనిపై పార్టీ నేతలతో చర్చలు జరిపారు.ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
రాజధానిపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు..!!

టీడీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధిపై కాకుండా.కేంద్రం ఏపీకి మోసం చేసిందన్న కోణంలోనే ఎన్నికలు జరగాలని ఆశపడుతోంది.

Advertisement

అమరావతిలో ఎలాంటి నిర్మాణాలు చేయలేకపోవడం, ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని పూర్తిగా అమలు చేయలేకపోవడం, మితిమీరిన అవినీతి వంటి పరిణామాల నేపథ్యంలో తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఆధారంగానే ఎన్నికలు జరిగితే ఎన్నికల్లో ఓటమి చవిచూడడం ఖాయం అని టీడీపీ ఒక అంచనాకు వచ్చేసింది.ముందస్తు ఎన్నికలు అనే మాటే మాట్లాడేందుకు టీడీపీ సాహసించడంలేదు.

తాజా వార్తలు