భూమిలో అధిక మోతాదులో రసాయన ఎరువులు వాడడం వల్ల భూమి సారవంతం కోల్పోవడంతో పాటు, దాదాపుగా నీటి వనరులు కూడా తగ్గుతాయి.ఇంకా సాగు భూమిలొ దాదాపు 5% చౌడు భూమిగా మారుతుంది.
భూమిలో నీటి నిల్వ సామర్థ్యం తగ్గుతుంది.ఈ ప్రభావం అంతా పంటలపై పడి శ్రమ ఎక్కువ.
పెట్టుబడి ఎక్కువ.కానీ దిగుబడి మాత్రం ఆశించిన స్థాయిలో ఉండదు.
వాటా డామ్ వాతావరణ కేంద్ర నివేదిక ప్రకారం వాతావరణం లో జరుగుతున్న మార్పుల కారణంగా 2050 నాటికి దక్షిణ భారతదేశంలో 15% వరకు ఆహార ఉత్పత్తులు తగ్గుతాయని అంచనా వేసింది.ప్రస్తుతం కొన్నిచోట్ల అధిక వర్షపాతం మరికొన్ని చోట్ల సాధారణ వర్షపాతం కురుస్తున్న ప్రాంతాల్లో భవిష్యత్తు కాలంలో వర్షపాతం 50 శాతం కంటే తక్కువగా కురుస్తుంది.
1 సెంటీగ్రేట్ ఉష్ణోగ్రత పెరిగితే పది శాతం ఉత్పత్తి తగ్గుతుంది.2100 నాటికి చైనా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాల్లో ఉష్ణోగ్రత విపరీతంగా 78° c పెరిగే అవకాశాలు ఉన్నాయి.తద్వారా ఆహార ఉత్పత్తులు సగానికి పైగా గణనీయంగా తగ్గే అవకాశాలు ఉన్నాయంటూ అంచనా వేసింది.భూమి సారవంతంగా మారాలంటే రైతులు వ్యవసాయంపై అవగాహన కల్పించుకుని విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులైన వాటిని వ్యవసాయ క్షేత్రాల్లోనే అభివృద్ధి చేసే పద్ధతులను తెలుసుకోవాలి.
సేంద్రియ ఎరువులను తయారు చేసుకుని, వీటి వాడకం పెంచాలి.
భూమిలో నీటి వనరులు పెరగాలంటే పశువుల, గొర్రెల, మేకల, బాతుల ఎరువులు విరివిగా వినియోగించాలి.వేసవికాలంలో పొలాలలో గుడారాలు లాంటివి వేసి, అందులో పశువులను ఉంచడంతో మూత్రం మరియు పేడా భూమిలో కలిసిపోతుంది.తర్వాత భూమిని దుక్కి దున్నినప్పుడు భూమి సారవంతంగా మారుతుంది.
భూమి లోపల ఉండే నీటి నిలువలకు ఎటువంటి హాని జరగదు.పైగా నాణ్యత గల పంటల వల్ల అనారోగ్య సమస్యలు ఉండవు.
రసాయన ఎరువుల వాడకం, నీటి వనరులపై, భూమి సారవంతం పై అధికంగా ప్రభావం చూపడంతో భూములు క్రమేణా వ్యవసాయానికి పనికి రాకుండా పోతాయి.