అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కి ఓ కేసులో ఊరట లభించింది.గత 20 నెలలుగా దర్యాప్తు జరుగుతూ వచ్చిన ఓ కేసు విషయంపై ఎట్టకేలకి ట్రంప్ పాత్ర లేదని తేల్చి చెప్పారు.ఇంతకీ ఏమిటా కేసు, ఏమిటా కధ అనే వివరాలలోకి వెళ్తే.
2016 లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా తో కలిసి ట్రంప్ కుట్రలు చేశారనే ఆరోపణపై ట్రంప్ పై విచారణ చేపట్టారు.అయితే రష్యాతో కలిసి ట్రంప్ ఎలాంటి కుట్రలు పన్నలేదని రాబర్ట్ ముల్లర్ నివేదికలో తెలిపింది.అధ్యక్ష వివాదానికి సంభందించి గడిచిన కొన్ని నెలలుగా కేసు దర్యాప్తు జరిపి నివేదిక రూపొందించిన రాబర్ట్ ముల్లర్ నివేదికని అమెరికా కాంగ్రెస్‌కు అటార్నీ జనరల్ విలియమ్ బార్ అందజేశారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యానికి సంభందించి ట్రంప్ పాత్ర తేల్చలేమని ఆయన నేరానికి పాల్పడ్డాడు అనే విషయం ఎక్కడా తేలలేదని నివేదికలో తెలిపారు.ప్రస్తుతం ఉన్న ఆధారలు కుట్ర జరిగాయనే ఆరోపణలకి సరిపోవడం లేదని ఆయన అన్నారు.ఇదే విషయాన్ని ట్రంప్ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు.