మజిలీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటి దివ్యాంశా కౌశిక్.ఈ సినిమాలో నాగచైతన్య స్నేహితురాలుగా నటించిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది.
మొదటి సినిమాతోనే ఎంతో గుర్తింపు పొందిన ఈమె ఇప్పటివరకు ఏ సినిమాలోను నటించలేదు అందుకు గల కారణం కరోనా రావడమే అని చెప్పాలి.కరోనా కారణం వల్ల తాను ఎలాంటి సినిమాలలో నటించలేదు.
అయితే తాజాగా ఈమె రవితేజ నటిస్తున్న రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమాలో నటిస్తున్నారు.
రవితేజ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ఈనెల 29వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నారు.ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నటి దివ్యాంశా కౌశిక్ మాట్లాడుతూ హీరో రవితేజ అలాగే నాగచైతన్య గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ నాగచైతన్య రవితేజతో పనిచేయడం రెండు అనుభవాలనీ తెలిపింది.

రవితేజ షూటింగ్ లొకేషన్లో ఉన్నప్పుడు ఎంతో యాక్టివ్ గా ఉంటారు అయితే నాగచైతన్య షూటింగ్ లొకేషన్లో ఉంటే చాలా కామ్ గా ఉంటారు.ఇలా వీరిద్దరూ రెండు విభిన్న రకాలుగా ఉన్నప్పటికీ వీరిద్దరి విషయంలో ఒక కామన్ క్వాలిటీ ఉంది.వీరిద్దరూ కనుక సెట్లో ఉంటే సరదాగా ఫ్రాంక్ చేస్తూ ఉంటారని దివ్యాంశా కౌశిక్ ఈ సందర్భంగా నాగచైతన్య రవితేజ గురించి వెల్లడించారు.
ప్రస్తుతం ఈమె చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.







