Anasuya : విజయ్ దేవరకొండ తమ్ముడి మూవీపై అలా రియాక్ట్ అయిన అనసూయ.. అస్సలు అర్థం కారంటూ?

తెలుగు ప్రేక్షకులకు యాంకర్ అనసూయ భరద్వాజ్ ( Anasuya Bharadwaj )గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తరచూ ఏదో ఒక విషయంతో వార్తలు నిలుస్తూ ఉంటుంది అనసూయ.

 Anchor Anasuya Tweet Baby Movie Telugu-TeluguStop.com

అయితే మొన్నటి వరకు యాంకర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరించిన అనసూయ ప్రస్తుతం నటిగా మారి వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది.ప్రస్తుతం అనసూయ చేతిలో ఐదారు సినిమాలు ఉన్నాయి.

క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతోంది అనసూయ.అయితే సినిమాలలో ఎక్కువగా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను విలన్ తరహా పాత్రలను చేస్తోంది.

కాగా అనసూయ ఇప్పటివరకు తెలుగులో రంగస్థలం( Rangasthalam ), పుష్ప, క్షణం, రంగ మార్తాండ, సోగ్గాడే చిన్నినాయన, లాంటి సినిమాలలో నటించి మెప్పించింది.ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో బిజీగా ఉంది.అంతబాగానే ఉంది కానీ ఇటీవల కాలంలో అనసూయ ఎక్కువగా కాంట్రవర్సీల విషయంలో సోషల్ మీడియాలో హైలెట్ అవుతోంది.సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ కాంట్రవర్సీకి కేరాఫ్ అవుతుంటుంది.

ముఖ్యంగా విజయ్ దేవరకొండ విషయంలో కాంట్రవర్సి ట్వీట్ చేయడం ట్రోల్స్ ని ఎదుర్కొంటోంది.గతంలో విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి విడుదల సమయంలో ఈమె పలు కామెంట్స్ చేసింది.

అప్పటినుంచి హీరో విజయ్ దేవరకొండపై ఏదో ఒక సందర్భంలో టీజ్ చేస్తూనే ఉంటుంది.

ఇది ఇలా ఉంటే తాజాగా మరోసారి సోషల్ మీడియాలో ట్వీట్ చేసింది అనసూయ.విజయ్ దేవరకొండ గతంలో డబ్బులిచ్చి మరీ తనని ట్రోల్ చేయించాడని అనసూయ కొన్నాళ్ల ముందు చెప్పుకొచ్చింది.ఇలా రౌడీహీరోతో ఈమె వివాదం నడుస్తూనే ఉంది.

ఇప్పుడు అతడి తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న బేబి( Baby movie ) సినిమాకి మాత్రం అనసూయ ఆల్ ది బెస్ట్ చెప్పింది.ఇది తనకు తెలిసిన వాళ్ల కథలా ఉందని ట్వీట్ చేసింది.

దీంతో అనసూయ పోస్ట్ కాస్త వైరల్‌గా మారిపోయింది.దీంతో అభిమానులు అనసూయ ప్రవర్తన ఏంటో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు.

మొన్నటి వరకు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ తో ఢీ అంటే ఢీ అన్నట్టు సంచలన ట్వీట్లు చేసిన అనసూయ ఇప్పుడు ఆనంద దేవరకొండకు ఆల్ ది బెస్ట్ చెప్పడంతో అభిమానులు అనసూయ ప్రవర్తన అర్థం కావడం లేదు అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube