ఉదయ్‌పూర్ ( Udaipur )కిచెన్ కా మహారాణి శశికళ( Sasikala ) గురించి మీరు విన్నారా? మీలో కొంతమంది వినే వుంటారు.ఇంటర్నెట్ వినియోగం తరువాత ఇలాంటివారు బాగా ప్రాచుర్యం పొందుతున్నారు.
అయితే ఈమె మనదేశంలో కంటే విదేశాల్లోనే బాగా ఫేమస్.ఆమె గరిట తిప్పిందంటే ఆహార ప్రియులు లొట్టలేసుకు నాలుక చప్పరించాల్సిందే.

అవును, ఆమె వంటకి నలభీములు సైతం వంక పెట్టలేరు అని భోగట్టా.పాకశాస్త్రంలో అద్భుతమైన ప్రావీణ్యం ఆమె సొంతం.అందుకే ఆమె దగ్గర వంటలు నేర్చుకునేందుకు విదేశాల నుంచి వలస వస్తారంటే నమ్మశక్యం కాదు.ఒకప్పుడు భర్త చనిపోయి ఒంటరిగా ఉన్న శశికళ ఇప్పుడు ఎంతోమంది విదేశీయులకు వంటలు నేర్పిస్తూ, వ్యాపారవేత్తగా పలువురికి ఆదర్శంగా నిలుస్తుంది.

రాజస్థాన్‌కు( Rajasthan ) చెందిన శశికళ జీవితం ఒకప్పుడు చాలా సాధాసీదాగానే ఉండేది.క్యాన్సర్ కారణంగా భర్తను కోల్పోయి చిన్నాచితక పనిచేసుకుంటూ ఒంటరిగా కాలం వెళ్లదీసేది.కానీ అనుకోకుండా ఒకరోజు ఆమె దశ తిరిగింది.ఒకప్పుడు ఒక్క ఇంగ్లీషు ముక్క కూడా రాని అతి సామాన్యురాలైన శశికళ ఇప్పుడు అనర్గళంగా ఇంగ్లీషు మాట్లాడుతుంటే అది ఆమె కార్యదక్షతకి కారణం.
ఆమె దగ్గర వంటలు నేర్చుకోవడానికి 30 దేశాలకు చెందిన వాళ్లు ఆన్‌లైన్‌లో స్లాట్ బుక్ చేసుకుంటున్నారంటే ఆమె వండే వంటలు ఎంత స్పెషలో అర్ధం చేసుకోవచ్చు.

విషయం ఏమంటే, ఓసారి ఐరీష్( Irish ) నుంచి వచ్చి దంపతులకు శశికళ మన భారతీయ వంటలు వండి వడ్డించింది.ఆ వంటలు తిన్న ఆ దంపతులు వాటి రుచికి ఫిదా అయిపోయారు.వెంటనే శశికళతో కుకింగ్ క్లాసెస్ ప్రారంభించమని ప్రోత్సహించారు.
అలా మొదలైన ఆమె ప్రయాణం నేటికీ కొనసాగుతుంది.మొదట్లో ఇంగ్లీష్ రాక చాలా ఇబ్బంది పడేది శశికళ ఇప్పుడు అనర్గళంగా మాట్లాడుతూ అదరగొడుతుంది.
శశికళ వద్ద కుకింగ్ పాఠాలు నేర్చుకునేందుకు విదేశాల నుంచి స్వయంగా ఉదయ్‌పూర్ వస్తుంటారంటే అతిశయోక్తి కాదు.







