వాట్సాప్( WhatsApp ) వాడేవారికి ఓ అదిరిపోయే గుడ్ న్యూస్.మెటా కంపెనీ తమ వాట్సాప్ వినియోగదారుల కోసం మరో లేటెస్ట్ అప్డేట్ తీసుకొచ్చింది.
దీనితో వాట్సాప్‌లో మరింత సులువుగా, ఆకర్షణీయంగా మెసేజ్‌లు పంపించేందుకు వీలవుతుందని తెలుపుతోంది.విషయం ఏమంటే స్టిక్కర్, అవతార్, జిఫ్ పిక్‌లను రీడిజైన్ చేస్తోంది.
ఇవి పూర్తైన తరువాత వినియోగదారులు ఎంచక్కా ఎప్పటిలానే మెస్సేజ్ రూపంలో వాటిని తమ ఇష్టమైన వారికి పంపించుకోవచ్చు.అయితే ప్రస్తుతం ఈ అప్డేట్ కేవలం ఐఓఎస్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉందనే విషయం తెలుసుకోండి.
త్వరలో మరి అందరికీ ఈ అప్డేట్ లోకి రానుంది.
అయితే దీనికోసం ఆపిల్ వినియోగదారులు యాపిల్ స్టోర్‌లోకి వెళ్లి, ఐఓఎస్ 23.13.78 వెర్షన్ వాట్సాప్‌ను అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.ఈ కొత్త అప్డేట్ వల్ల వాట్సాప్ యూజర్లు అన్లిమిటెడ్ స్టిక్కర్స్, జిఫ్ ఫైల్స్‌ను విరివిగా వినియోగించుకోవచ్చు.ఇక్కడ చెప్పుకోదగ్గ మరో విషయం ఏమిటంటే, ఈ న్యూ అప్డేట్లో జిఫ్, స్టిక్కర్, అవతార్ సెక్షన్లను రీలొకేట్ చేయడం జరిగింది.
అలాగే ట్యాబ్స్ విషయంలోనూ మార్పులు చేసినట్టు తెలుస్తోంది.దీని వల్ల యూజర్లు మరింత సులువుగా నావిగేట్ చేయగలుగుతారు.అవతార్ కేటగిరీని కూడా బాగా ఇంప్రూవ్ చేశారు.దీని వల్ల చాలా పెద్ద సంఖ్యలో అవతార్ స్టిక్కర్లు( Avatar stickers ), పిక్చర్లను యూజర్లు వినియోగించుకోవచ్చు.
మరో విషయం ఏమంటే త్వరలో వాట్సాప్ వెబ్‌లో.ఫోన్ నంబర్ ద్వారా వాట్సాప్ ఖాతాలు అన్నీ అనుసంధానం చేసుకునే విధంగా అప్డేట్ తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మురంగా కొనసాగుతున్నట్టు తెలుస్తోంది.అవి మాత్రమే కాకుండా వాట్సాప్‌లోనే చాట్ డిలీట్, ఫోటో ఎడిటింగ్ ఫీచర్, చాట్ ఎడిట్ ఫీచర్లు తీసుకురానుంది.నేటి యువత దైనందిన జీవితంలో వాట్సాప్ ఒక భాగమైపోయిందనే విషయం విదితమే.
కానీ ఇదే సమయంలో దీనిని లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు రకరకాలుగా రెచ్చిపోతున్నారు.స్కామ్ మెసేజ్‌లు( Scam messages), వీడియోలు పంపిస్తూ, యూజర్ల డేటాను చోరీ చేస్తున్న ఘటనలు మనం అనేకం చూస్తూ వున్నాం.
కనుక వాట్సాప్ వినియోగదారులు కచ్చితంగా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.






