కుందూరు జానారెడ్డి(Kunduru Janareddy ), రాష్ట్రంలో అత్యధిక కాలం ఎమ్మెల్యేగా గెలిచిన చరిత్ర ఆయన సొంతం ఏడు పర్యాయాలు శాసనసభకు ఎన్నికవ్వడంతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అత్యధిక కాలం మంత్రిగా పనిచేసిన రికార్డు కూడా ఆయన పేరు ఉంది .ఎన్టి రామరావ్ పెట్టిన తెలుగుదేశం పార్టీ తో తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంబించిన జానారెడ్డి ఆ పార్టీ టికెట్ పై రెండు సార్లు శాసన సభ్యుడు గా గెలుపొందారు .
తదనంతర పరిణామాలతో జాతీయ పార్టీ కాంగ్రెస్ ( Congress )లో చేరి అనేక పదవులు నిర్వహించారు .

హోమ్ శాఖ తో పాటు అనేక పదవులు సమర్దవంతం గా నిర్వహించిన జానారెడ్డి ని పార్టీల కతీతంగా అందరూ గౌరవిస్తారు .అయితే వయోభారంతో రాజకీయాలకు విరమణ ప్రకటించిన ఆయన తన కుమారుల రాజకీయ అరంగేట్రం కోసం రంగం సిద్ధం చేసుకుంటున్నారు.పెద్ద కుమారుడ్ని మిర్యాలగూడ( Miryalaguda ) నుంచి చిన్న కుమారుడ్ని నాగార్జున సాగర్ నుంచి పోటీ చేయించేందుకు ఆయన ఇప్పటికే కార్యాచరణ రూపొందించారని వారితో బ్రింగ్ బ్యాక్ కాంగ్రెస్ పేరుతో చైతన్య యాత్రలు కూడా నియోజకవర్గాలలో నిర్వహిస్తూ ప్రజాధరణ చురగొనేలా ప్రత్యేక వ్యూహాలు రూపొందిస్తున్నారని వార్తలు వచ్చాయి.
అయితే కర్ణాటక ఎన్నికల ఫలితాలు తరువాత తెలంగాణలో( Telangana ) కూడా కాంగ్రెస్ అధికారం వచ్చే సూచనలు కనబడుతున్నాయి , కాబట్టి సీనియర్ కోటాలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా తనని పరిశీలిస్తుందన్న ఆశలు ఆయనకు మళ్ళీ ప్రత్యక్ష రాజకీయాల వైపు మనసు లాగుతున్నట్లుగా విశ్లేషణలు వస్తున్నాయి.

తన సీనియారిటీకి ఖచ్చితంగా కాంగ్రెస్ అధిష్టానం తనను గుర్తిస్తున్నదని అందువల్ల అసెంబ్లీకి పోటీ చేస్తే ఎలా ఉంటుందని ఆయన తన సహచరులతో సమాలోచనలు జరుపుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.ఇప్పటివరకు ఆయన బహిరంగంగా ఏ రకమైన ప్రకటన చేయలేదు కానీ కాంగ్రెస్ అధిష్టానం కనుక తనకు టచ్ లోకి వచ్చి ఆదేశిస్తే పోటీకి సిద్ధపడాలని ఆయన అనుకుంటున్నట్లుగా తెలుస్తుంది.అయితే ఇప్పటికే సీఎం అభ్యర్థులతో కిక్కిరిసిపోతున్న తెలంగాణ కాంగ్రెస్లో జానా రెడ్డి రాకతో మరింత గందరగోళ్ల పరిస్థితులు ఏర్పడి అసలుకే మోసం వచ్చే అవకాశం ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి .మరి జానారెడ్డి పై వస్తున్న వార్తలపై రేవంత్ రెడ్డి కొ స్పందన ఏమిటో చూడాలి.







