ఎప్పటికప్పుడు కొత్త కొత్త సాంకేతికత అందుబాటులోకి వస్తోంది.ముఖ్యంగా వ్యవసాయం యాంత్రీకరణ అవుతోంది.
రైతులు పురుగుల మందులు కొట్టే సమయంలో వాటి ప్రభావానికి గురై ప్రాణాలు కోల్పోయే వారు.ప్రస్తుతం డ్రోన్ టెక్నాలజీ రావడంతో పొలం గట్టును కూర్చుని పొలమంతా పురుగుల మందు కొట్టేస్తున్నారు.
ఇదే కాకుండా కోత కోసే యంత్రాలు, నాట్లు వేసే యంత్రాలు ఇలా ప్రతి విషయానికి రైతుకు కష్టం లేకుండా చేసే టెక్నాలజీ, యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి.ఇదే కోవలో సరికొత్త ట్రాక్టర్‌ను వరంగల్ కిట్స్ కాలేజీ ప్రొఫెసర్లు, విద్యార్థులు కలిసి ఆవిష్కరించారు.
దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.

ట్రాక్టర్‌తో దున్నేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.ఒక్కోసారి పొలం దున్నేటప్పుడు ట్రాక్టర్ తిరగబడి చాలా మంది రైతులు చనిపోయిన సందర్భాలు ఉన్నాయి.దీని కోసం పరిష్కారం చూపించాలని వరంగల్ కిట్స్ కాలేజీ వారు భావించారు.
దీనిని ప్రొఫెసర్ నరసింహారెడ్డి ఆవిష్కరించారు.దీనిపై ఆయన పేటెంట్ కోసం ప్రయత్నిస్తున్నారు.
దీనికి డ్రైవర్ రహిత ట్రాక్టర్ అనే పేరు కూడా పెట్టారు.ఈ ప్రాజెక్టుకు కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ నుంచి రూ.41 లక్షలు 2020 ఫిబ్రవరిలో మంజూరు అయ్యాయి.దీనిని మూడేళ్లు శ్రమించి దీనిని అభివృద్ధి చేశారు.
బ్రేకులు, క్లచ్, ఎక్స్‌లేటర్‌లను ఆపరేట్ చేయడానికి, స్టీరింగ్ తిప్పడానికి ట్రాక్టర్‌పై కూర్చోనవసరం లేదు.కేవలం సెల్ ఫోన్ ద్వారా ట్రాక్టర్‌ను ఆపరేట్ చేయొచ్చు.
ఈ టెక్నాలజీని రైతులకు అందించేందుకు వారు యత్నిస్తున్నారు.దీనికి కేవలం రూ.20 వేలు మాత్రమే ఖర్చు అవుతుందని పేర్కొంటున్నారు.దీనిని కళాశాలలో పరీక్షించగా విజయవంతం అయింది.







