ఇటీవల లోక్ సభలో ప్రధాని మోడీ పై రాహుల్ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై లోక్ సభ సెక్రటరీయేట్ ఆదివారం నోటీసులు జారీ చేయడం తెలిసిందే.ఈనెల 15వ తేదీలోగా వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొనడం జరిగింది.
ప్రధానిపై చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకారంగా.నిబంధనలను ఉల్లంఘించినట్లు.
బిజెపి ఎంపీ నిషికాంత్ దూభే… పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద జోషికీ ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ క్రమంలో తనకు పంపించిన సభా హక్కుల నోటీసులపై రాహుల్ గాంధీ స్పందించారు.

నోటీసులకు భయపడేది లేదని స్పష్టం చేశారు.పార్లమెంటులో ఆదానితో మోడీకి ఉన్న సంబంధాలపైనే ప్రశ్నలు వేయడం జరిగిందని క్లారిటీ ఇచ్చారు.తాను చేసిన వ్యాఖ్యలలో ఎక్కడా కూడా ప్రధానిని కించపరిచే వ్యాఖ్యలు లేవని తెలిపారు.పార్లమెంటులో మోడీయే తనని అవమానించారని రాహుల్ ఆరోపించారు.నెహ్రూ కాకుండా గాంధీ పేరు.ఎందుకు పెట్టుకున్నారని ప్రశ్నించారు.అంటూ రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు.







