సోదరుడికి రాఖీ కట్టేటప్పుడు ఏ దిశలో కూర్చోవాలి.. అలాగే ఏ మంత్రాన్ని జపించాలో తెలుసా..!

ముఖ్యంగా చెప్పాలంటే రక్షాబంధన్( Raksha Bandhan ) గురించి పురాణాలలో చాలా చోట్ల ప్రస్తావించారు.అదే సమయంలో మంత్రాలు పఠించకుండా లేదా పటించకుండా ఏ పవిత్ర పండుగను విజయవంతంగా పరిగణించరు.

 Vastu Rules To Be Followed Tying Rakhi,rakhi,raksha Bandhan,shubha Muhurtam,vast-TeluguStop.com

ఈ నేపథ్యంలో రాఖీ కట్టేటప్పుడు ఏ దిక్కున కూర్చుంటే మంచిది, అలాగే ఏ మంత్రం పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే సోదరీ తన సోదరుడికి రాఖీ( Rakhi ) కట్టేటప్పుడు సోదరుడు నెల పై తూర్పుముఖంగా కూర్చోవాలి.

సోదరీ తన సోదరుడి నుదుటి పై పడమర ముఖంగా కుంకుమ చందనంతో తిలక ధారణ చేయాలి.అలాగే అక్షతలను వేసిన తర్వాత రక్షణ సూత్రాన్ని తీసుకొని సోదరుడి కుడి చేతికి రాఖీ కట్టాలి.

ఆ తర్వాత హారతిని ఇవ్వాలి.


ఇంకా చెప్పాలంటే రక్షాబంధన్ రోజున సోదరులకు సోదరీమణులు( Brothers Sisters ) మణికట్టు పై రాఖీ కడుతూ పది త్వమనుబధ్నామి రక్ష మా చల్ మా చల్ మంత్రాన్ని జపిస్తూ ఉండాలి.అంటే మహాబలావంతుడైన రాక్షక రాజు బలి చక్రవర్తి ఏ రక్షాబంధన్ కి కట్టబడ్డాడో అదే రక్షాబంధన్ తో నేను నిన్ను కట్టి వేస్తున్నాను అని చెప్పాలి.అదే నిన్ను రక్షిస్తుంది అని ఈ మంత్రం యొక్క అర్థమవుతుంది.

ఇంకా చెప్పాలంటే రాఖీ పర్వ దినం( Rakhi Festival ) రోజున సోదరుడి చేతికి శాస్త్రోక్తంగా రాఖీ కట్టేటప్పుడు ఈ మంత్రాన్ని పాటిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి.


అంతేకాకుండా మీ సోదరుడి పై దుష్టశక్తుల ప్రభావం పడదు.

అనుకున్నా పనులలో విజయం సాధిస్తారు.అలాగే ఈ ఏడాది శ్రావణ పౌర్ణమి ఆగస్టు 30 లేదా 31 రెండు రోజులలో వచ్చింది.పూర్ణిమ తిధి ఆగస్టు 30 ఉదయం 10.58 నిమిషములకు మొదలై మరుసటి రోజు ఉదయం ఏడు గంటల ఐదు నిమిషములకు ముగిసిపోతుంది.ఆ సమయంలో రాఖీ కట్టకూడదు.సోదరుడికి రాఖీ కట్టడానికి శుభసమయం 30వ తేదీ రాత్రి 9 గంటల ఒక నిమిషం నుంచి మరుసటి రోజు 31వ తేదీ 7.5 నిమిషాల వరకు ఉంటుంది.

Vastu Rules to be Followed Tying Rakhi to Brother

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube