కాల్షియం కోసం పాలే కాదు ఈ ఆహారాలు కూడా తీసుకోవచ్చు.‌. తెలుసా?

కాల్షియం అంటే అందరికీ దాదాపు మొదట పాలు గుర్తుకు వస్తాయి.ఒంట్లో కాల్షియం లేదు అంటే దాదాపు అందరూ పాలు తాగమని చెబుతుంటారు.

 Do You Know What Foods You Can Take For Calcium? Calcium, Calcium Rich Foods, La-TeluguStop.com

ఎందుకంటే పాలలో పుష్కలంగా కాల్షియం ఉంటుంది.రోజుకు ఒక గ్లాసు పాలు తాగితే ఎముకల సమస్యలు దరి దాపుల్లోకి రావు.

ఇది అక్షరాల నిజం.కానీ కొంతమందికి పాలు అంటే అస్సలు ఇష్టం ఉండదు.

కనీసం పాలు వాసన కూడా పడదు.మరి అలాంటి వారి పరిస్థితి ఏంటి.? వారికి కాల్షియం ఎలా లభిస్తుంది.? అన్న డౌట్ ఎంద‌రికో ఉంటుంది.

Telugu Calcium, Tips, Latest, Milk, Milkalternative-Telugu Health

అయితే వాస్త‌వానికి కాల్షియం పాలలో మాత్రమే కాదు మరెన్నో ఆహారాల్లో ఉంటుంది.ఈ నేపథ్యంలోనే పాలు కాకుండా కాల్షియం పుష్కలంగా ఉండే ఆహారాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.బాదం పప్పు( Almonds ) కాల్షియంకు గొప్ప మూలం అని చెప్పుకోవచ్చు.జంతువు పాలకు ప్రత్యామ్నాయంగా మీరు బాదం పాలను ఎంపిక చేసుకోవచ్చు.బాదం పాలలో కాల్షియంతో పాటు ఎన్నో పోషకాలు ఉంటాయి.బాదం పాలను తీసుకుంటే ఎముకలు బలోపేతం అవుతాయి.

మోకాళ్ళ నొప్పులు వేధించకుండా ఉంటాయి.పైగా బాదం పాలు తాగితే వెయిట్ లాస్ కూడా అవుతారు.

Telugu Calcium, Tips, Latest, Milk, Milkalternative-Telugu Health

అలాగే కాల్షియం పుష్కలంగా ఉండే ఆహారాల్లో పన్నీర్( Paneer ) ఒకటి.పన్నీర్ ను నిత్యం తీసుకోవచ్చు.కాకపోతే లిమిటెడ్ గా తీసుకోవాలి.పన్నీర్ కాల్షియం కొరతను దూరం చేస్తుంది.ఎముకలు దంతాలను దృఢపరుస్తుంది.బీన్స్ లో కూడా కాల్షియం మెండుగా ఉంటుంది.

తరచూ ఉడికించిన బీన్స్ ను తీసుకుంటే కాల్షియం లోపానికి దూరంగా ఉండొచ్చు.పాలు కాకుండా కాల్షియం అత్యధికంగా ఉండే ఆహారాల్లో అత్తి పండ్లు కూడా ఒకటి.

ముఖ్యంగా ఎండిన అత్తి పండ్ల( Anjeer Fruits )లో కాల్షియం రిచ్ గా ఉంటుంది.నిత్యం రెండు నానబెట్టిన అత్తిపండ్లను తీసుకోండి.

ఇక కాల్షియం కోసం మీరు ఆకుకూరలను కూడా ఎంపిక చేసుకోవచ్చు.ప్ర‌తి రోజూ ఏదో ఒక ఆకుకూరను తీసుకుంటే కాల్షియం తో పాటు ఎన్నో రకాల పోషకాలను పొందుతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube