మీడియం రేంజ్ హీరోలలో మాస్ ఆడియన్స్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో రామ్ పోతినేని.( Ram Pothineni ) దేవదాస్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రామ్, ఆ సినిమా సూపర్ హిట్ తర్వాత అలాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఎన్నో చేసాడు.మధ్యలో కొన్ని ఫ్లాప్స్ వచ్చాయి కానీ, మళ్ళీ వెంటనే బౌన్స్ బ్యాక్ అయ్యి మీడియం రేంజ్ హీరోలలో తానే నెంబర్ 1 అని నిరూపించుకున్నాడు.‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో కెరీర్ లో మరోసారి దుమ్ములేపే మాస్ బ్లాక్ బస్టర్ ని అందుకున్న రామ్, ఆ తర్వాత రెడ్ మరియు ‘వారియర్’ వంటి సినిమాలు చేసాడు.రెండు కూడా కమర్షియల్ గా ఫ్లాప్ అయ్యాయి కానీ ఓపెనింగ్స్ పరంగా మాత్రం రెండు సినిమాలు దుమ్ములు లేపాయి.ఆ రెండు చిత్రాల తర్వాత రామ్ హీరో గా నటించిన చిత్రం ‘స్కంద’.
( Skanda Movie ) బోయపాటి శ్రీను ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు.
‘అఖండ ‘ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత బోయపాటి శ్రీను( Boyapati Srinu ) చేస్తున్న సినిమా కావడం తో ఈ చిత్రం పై ట్రేడ్ లో అంచనాలు స్టార్ హీరో కి ఏమాత్రం తీసిపోని విధంగా ఉండేవి.ఆలా భారీ అంచనాల నడుమ నిన్న గ్రాండ్ గా విడుదలైన ఈ చిత్రానికి మొదటి ఆట నుండే డివైడ్ టాక్ వచ్చింది.సినిమా కంటెంట్ మొత్తం మాస్ ఆడియన్స్ కి నచ్చే విధంగా ఉన్నప్పటికీ, మరీ ఓవర్ గా అనిపించడం తో కొంతమంది ఆడియన్స్ ఛీ కొట్టారు.
కానీ ఓపెనింగ్స్ మాత్రం అదిరిపోయాయి.ట్రేడ్ అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి తెలంగాణ లో యావరేజి రేంజ్ ఓపెనింగ్స్ వచ్చాయి కానీ, ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం ప్రతీ సెంటర్ లో దుమ్ము దులిపేసింది.
ముఖ్యంగా సాయంత్రం మరియు రాత్రి ఆటలు హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కిక్కిరిసిపోయాయి.
ట్రేడ్ అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి మొదటి రోజు 11 నుండి 12 కోట్ల రూపాయిలు కేవలం రెండు తెలుగు రాష్ట్రాల నుండి వస్తాయట.ఇక ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతాలకు కలిపి 14 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.బోయపాటి సినిమాలకు ఓవర్సీస్ లో అసలు మార్కెట్ ఉండదు అనే విషయం అందరికీ తెలిసిందే.
ఈ సినిమాకి కూడా ఓవర్సీస్ లో అసలు వసూళ్లే రాలేదు.బోయపాటి శ్రీను గత చిత్రం అఖండ( Akhanda ) ఇక్కడ ఫుల్ రన్ లో 1 మిలియన్ డాలర్లు వసూలు చేసింది.
ఇదే ఆయన కెరీర్ హైయెస్ట్ వసూళ్లు.దీనిని మళ్ళీ ఆయన బాలయ్య తోనే కొడుతాడేమో.
ఓవర్సీస్ కూడా సహకరించి ఉంటే ‘స్కంద’ ఓపెనింగ్స్ 20 కోట్ల రూపాయిల వరకు ఉండేదని అంటున్నారు ట్రేడ్ పండితులు.