సినీ ఇండస్ట్రీలో కొన్ని కొన్ని సార్లు నటీనటులకు పొరపాటున ప్రమాదాలు జరుగుతుంటాయి.ఇక యాక్షన్ సినిమాలలో మాత్రం ఫైట్స్ ఎక్కువగా ఉండటంతో హీరోలకు గాయాలు అవుతుంటాయి.
అలా ఇప్పటికీ ఎంతోమంది నటీనటులకు ఎన్నోసార్లు గాయాలు అయ్యాయి.ఇక కొన్నిసార్లు ఆ విషయాలు బయట పడకుండా జాగ్రత్త పడుతుంటారు సినీ బృందాలు.
అలా ఓ సారి రానాకు కూడా గాయాలు అవటంతో బయటకి పొక్కకుండా జాగ్రత్తలు పడ్డారు.ఇంతకూ అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం.
తెలుగు సినీ ఇండస్ట్రీలో రానా గురించి, ఆయన నటన గురించి అందరికీ తెలిసిందే.లీడర్ సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన రానా ఈ సినిమాలో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఆ తర్వాత ఎన్నో సినిమాలలో నటించగా నేను నా రాక్షసి, నా ఇష్టం, కృష్ణం వందే జగద్గురుం వంటి పలు సినిమాలు మంచి సక్సెస్ ను అందించాయి.ఇక పాన్ ఇండియా మూవీ బాహుబలి సినిమాలో నటించి ఎనలేని క్రేజ్ సంపాదించుకున్నాడు.
ప్రస్తుతం వరుస సినిమాలతో బాగా బిజీగా ఉన్నాడు.ఈయన తన స్నేహితురాల్ని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.
పెళ్లి తర్వాత కూడా వరుస అవకాశాలు అందుకుంటూ ఓ రేంజ్ లో దూసుకెళ్తున్నాడు.రానాకు టాలీవుడ్ ఇండస్ట్రీలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
ఈయన ఏ పాత్రకైనా బాగా సెట్ అవుతాడు.బాహుబలి సినిమాలో నెగటివ్ పాత్రతో మాత్రం మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు.

ఇదంతా పక్కన పెడితే ఈయనకు గతంలో ఓ సినిమా షూటింగ్ లో గాయాలు అయ్యాయట.ఇక ఈ విషయం అభిమానులకు తెలిస్తే గొడవ చేస్తారన్న భయంతో సిని బృందాలు ఈ విషయాన్ని బయట పెట్టకుండా జాగ్రత్త పడ్డారట.కానీ ఓ సారీ రానా నే స్వయంగా తనకి ఇలా జరిగింది అని అభిమానులకు తెలిస్తే కంగారు పడతారని చెప్పకుండా దాచి పెట్టామని తెలిపాడు.

ఆయన ఎక్కువగా యాక్షన్ సినిమాలలోనే నటిస్తుంటాడు.అయితే గతంలో బాహుబలి, రుద్రమదేవి సినిమాలలో ఎక్కువగా యాక్షన్ సీన్స్ ఉండటంతో ఈ సినిమాల కోసం బాగా ప్రాక్టీస్ చేశాడు రానా.దీంతో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో అతడికి చిన్న ప్రమాదం జరిగింది.
ఈ సినిమాలలో యాక్షన్ ఎపిసోడ్స్ ఉండటంతో ముందుగానే ఈ సినీ దర్శకులు ఆర్టిస్టులకు వీటిపై అవగాహన కల్పించటానికి నిపుణులతో ప్రత్యేకంగా ప్రాక్టీస్ సెషన్ ఏర్పాటు చేశారు.దీంతో రానా కూడా ప్రాక్టీస్ చేయడంతో అతని తలకు గాయం అయింది.
వెంటనే సిని బృందాలు కేర్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ అందించారు.

ప్రస్తుతం రానా వరుస సినిమాలతో బాగా బిజీగా ఉన్నాడు.ఈ ఏడాది అరణ్య సినిమాలో నటించగా ఈ సినిమా అంత సక్సెస్ కాలేకపోయింది.ఇక విరాటపర్వం సినిమాలో కూడా నటించిన సంగతి తెలిసిందే.
అంతేకాకుండా పవన్ కళ్యాణ్ నటిస్తున్న భీమ్లా నాయక్ సినిమాలో కూడా నటిస్తున్నాడు రానా.ఇందులో రానా పవన్ కు ఎదురు తిరిగే పాత్రలో కనిపించనున్నాడు.
వీటితో పాటు వెంకీ దర్శకత్వంలో కూడా మరో సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది.